ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై అమిత్ షా ప్రత్యేక దృష్టి

ఈ మధ్య కాలంలో బిజెపి ఎన్నికల వ్యూహాలను విన్నుత్నంగా, విజయవంతంగా రూపొందించడం ద్వారా గతంలో ఇప్పటి వరకు ఏ పార్టికి కుడా సాధ్యం కాని విధంగా 20 రాష్త్రాలలో అధికారంలోకి వచ్చే విధంగా చేయడంలో కీలక పాత్ర వహిస్తున్న బిజెపి అద్యక్షుడు అమిత్ షా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటి వరకు బిజెపి బలమైన రాజకీయ శక్తిగా లేని రాష్త్రాల పట్ల దృష్టి సారిన్స్తున్నారు.

సాంప్రదాయ ఎన్నికల ప్రచార వ్యూహాలను అమిత్ షా పూర్తిగా మార్చివేసారు. మొట్టమొదటి సారిగా పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ యంత్రాంగం గురించి దృష్టి సారించడం ద్వారా ప్రతి వోటర్ వద్దకు నేరుగా చేరుకొనే విధంగా చేస్తున్నారు. అట్లాగే సోషల్ మీడియా వేదికలను పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ల పట్ల బిజెపి నాయకత్వం ప్రధానంగా దృష్టి సారిస్తున్నది. ఆ మూడు రాష్ట్రలలో ప్రస్తుతం బిజెపి అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడం కోసం గురించి ఆయా రాష్ట్రంలోని పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తున్నది. అమిత్ షా మాత్రం పశ్చిమ బెంగాల్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లపై ద్రుష్టి సారిస్తున్నారు. ఈ రాష్ట్రలలో బిజెపి లేకుండా ప్రభుత్వాలు ఏర్పడలేని పరిస్థితులు ఏర్పాటుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ నాలుగు రాష్ట్రలలో పార్టీని విజయం వైపు నడిపించ గలిగితేనే తన లక్ష్యం నేరవేరిన్నట్లు కాగలదని అమిత్ షా రాయపూర్ లో చెప్పారు.

నాలుగేళ్ల క్రితం పార్టీ అద్యక్ష పదవి చేపట్టగానే ఇప్పటి వరకు బిజెపి బలమైన రాజకీయ శక్తిగా ఎదగలేని ఏడు రాష్ట్రలు – పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలలో పార్టీని పటిష్ట పరచడమే తన లక్షంగా ప్రకటించడం తెలిసిందే. ఆ దిశలో కర్ణాటక, పశ్చిమ బెంగాల్ లలో పార్టీని బలోపేతం చేయగలిగారు. తమిళ్ నాడులో ఇంకా పట్టు దొరకవలసి ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రలు, కేరళ పట్ల ప్రత్యేకంగా ద్రుష్టి సారిస్తున్నారు.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో వరుసగా నాల్గవ సారి బిజెపి అధికారంలోకి రాగలదని అమిత్ షా ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజస్తాన్ లో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ బలహీనతలను ఆసరాగా తీసుకొని వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు.