కురోళ్ళను తుపాకి పట్టమన్నాడు.. కొడుకుకేమో కాంగ్రెస్ సీట్ అట !

 "గద్దర్" గా పిలువబడే గుమ్మడి విఠల్ రావు ఉస్మానియా యూనివర్సిటీలో తాను చదువుతున్న ఇంజినీరింగ్ విద్యను అర్ధాంతరంగా ఆపేసి బాంక్ ఉద్యోగంలో చేరి, ఆ తరువాత తన ఆట పాటల తూటాలతో ఎందరో అమాయక యువకులను అడవుల పాల్జేశారు. ఎందరో అమాయక యువకులను అడవులకు వెళ్లి తుపాకులు పట్టమని రెచ్చగొట్టే విధంగా ఆట, పాటలతో ఆలరించారు.

`బ్యాల్లేట్’పై నమ్మకం లేదంటూ మొన్నటి వరకు అసలు ఓటర్ల జాబితాలో పేరు కుడా నమోదు చేసుకోలేదు. అడవుల వెంట తిరిగి సాయుధ మావోయిస్ట్ లను ప్రోతహిస్తూ ఆటపాటలతో వారిని హింస, విధ్వసంలకు పాల్పాడమని ప్రోత్సహించారు. భూస్వాములు... బూర్జువాలు అనే నుడికట్టు పదాలు/మాటలు/పాటలు వల్లేవేస్తూ బడుగు వర్గాల యువకులను చదువు మానిపించి, అడవుల బాట పట్టేటట్లు చేసారు.

అయితే తనకు మాత్రం ఆ నీడ పడకుండా మొదటినుండి జాగ్రత్త పడుతూనే ఉన్నట్లున్నారు. అదే బూర్జువా/భూస్వామి మిత్రుడు  నుండి  సికింద్రాబాదు అల్వాలులో ఎంతో విశాలమైన స్థలాన్ని బహుమతిగా పొంది, అందులో ఓ స్కూల్ స్థాపించి, దాని నిర్వహణ భాధ్యతలు భార్యకు అప్పగించారు అనుకోండి. తన బిడ్డలకు మాత్రం కార్పొరేట్ విద్యలు చెప్పించారు.

ఇప్పుడు కొడుకు కోసం తన ఆట, మాటలన్ని మరచిపోయి ఇంతకాలం తెగనాడిన బూర్జువా నేతల ప్రాపకం కోసం తిరుగుతున్నారు. కొడుకు సూర్యకిరణ్ కాంగ్రెస్ లో చేరడంతో అతని రాజకీయ భవిష్యత్ కోసం మావోయిస్ట్ ల `ఎన్నికల బహిష్కరణ’ నినాదం భూటకం అని 71 ఏళ్ళ వయస్సులో గ్రహించారు ఏమో ఈ మధ్యనే ఓటరుగా పేరు నమోదు చేసుకున్నారు. ఇప్పుడు కొడుకుకు కాంగ్రెస్ సీట్ ఇస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకుటమి అభ్యర్ధుల కోసం ప్రచారం కుడా చేస్తానని ముందుకొచ్చారు.

అంతే కాదు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుపై కూటమి అభ్యర్ధిగా పోటీ చేయడానికి సిద్దపడుతున్నారు. అయితే తను మాత్రం ఏ పార్టీలో చేరారట. దశాబ్దాలుగా ఏ రాజకీయ పార్టీ విధానాలను తూర్పార ఆడుతూ ఉరూరా, అడవులలో తిరిగారో ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, ఆయన అమ్మగారు సోనియా గాంధీలను ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి దర్శనం చేసుకు వచ్చారు. భార్య, కుమారుడితో కలసి వెళ్లి కలిసి కుమారుడికి సీట్ ఇవ్వమని ప్రాధేయపడ్డారు.

కొడుకుకు బెల్లంపల్లి సీట్ అడుగుతున్నారు. అక్కడ ఏమైనా కొడుకుకు బలం ఉన్నదంటే అదేమే లేదు. కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి అయిన సిపిఐ నేత మల్లేష్ గౌడ్ అక్కడ నుండి గతంలో గెలుపొందారు. ఇప్పుడు మళ్ళి పోటీ చేయాలి అనుకొంటున్నారు. దానితో సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డిని కూడా కలసి తన కుమారుడి రాజకీయ అర్రగేటంకు అడ్డు రావద్దని అంటూ కోరారు.

ఈయన ఆటపాటలకు అరచేతిలో "మరోప్రపంచం" చూసి,  ఒళ్ళుమరచి అడవిదారి పట్టి, తమ కడ్డొచ్చారనుకున్న వేలాది సామాన్య ప్రజల్ని ఒకవంకా, పోలీసుల్ని మరోవంక అత్యంత కిరాతకంగా చంపి, మరోనాడు ఆ పోలీసుల ఎదురు కాల్పుల్లో చచ్చిన ఆ నక్సలైట్లు, వీళ్ళందరి సమాధులను మెట్లుగా మార్చుకొని, నేడు "మరో అందలం" ఎక్క చూస్తున్న గద్దర్. ఏ కాంగ్రెస్ వారి బూచి చూపి నాడు గజ్జె కట్టి తైతక్క లాడాడో, నేడా కాంగ్రెస్ వారినే ముద్దాడి మురిసి పతున్నారు.

మొన్నటిదాకా మొలకు ఓ మాసిపోయిన ముతక గోచీగుడ్డ, పైన ఓ గొంగడి, చెప్పుల్లేని కాళ్ళు, నేడేమో కాళ్ళకు ఖరీదైన బూట్లు, చేతికీ బ్రాండెడ్ కాస్ట్లీ వాచీ, ఒంటి పైన ఖరీదైన గుడ్డలు. అదేదో శంకరాచార్యుల్లా చేతిలో అస్తమానం ఓ "దండం" పట్టుకు తిరిగే గద్దర్ ఈ అడుగులు కాకలు తిరిగిన నేటి రాజకీయ నాయకులకే "దగ్గులు" నేర్పగలవనడంలో ఏ మాత్రం సందేహం లేదు. `బుల్లెట్ల’పై బ్రహ్మ్మలు పోగొట్టుకొని ఇప్పుడు `బ్యాలెట్’ బాట పడుతున్నారా ? లేదా కొడుకును ఆకాశం ఎక్కిదామను కొని దొరికిన దారిన పడుతున్నారా ?

నిన్నటి వరకు మావోయిస్ట్ ల స్వరాన్ని తన ఆట, పాటలతో వినిపించిన గద్దర్ ఇప్పుడు రాహుల్, సోనియాల స్వరాన్ని ఎన్నికల ప్రచారంలో వినిపిస్తారా ? ఎన్నికల రాజకీయాలనే చీదరించుకొంటూ వచ్చిన `విప్లవ సూర్యుడు’ ఇప్పుడు అదే `బురద’లో కూరుకు పోవడానికి సిద్దపడుతున్నారా ? ఇప్పటి వరకు `విప్లవం’ పేరుతో పేద, బడుగు వర్గాలకు చెందిన యువతను తప్పుడు మార్గం పాటించి, వారి జీవితాలను `రక్తమయం’ గావించి, ఇప్పుడు కొడుకు సంగతి వచ్చే సరికి ఆ `పొరపాటు’ జరగా రాదనీ వృద్దాప్య జీవనంలో `సత్యం’ తెలుసు కున్నారా ?

కొడుకుతో కలసి చట్ట సభలలో అడుగు పెట్టి అక్కడా కుడా `విప్లవ గీతాలు’ ఆలపిస్తారా ? సమాధానం చెప్పుకోవడానికి కుడా సిద్ద పడటం లేదు. `మతోన్మాదం’, `ఫాసిజం’ వంటి కొన్ని పడికట్టు పదాలను కాంగ్రెస్ పంచన చేరడం కోసం ఉపయోగించు కొంటున్నారు. అయితే జనం అంత అమాయకులు కారని గ్రహించాలి. ఎవ్వరి కోసం, ఎడుకోసం ఈ పాట్లు పడుతున్నారో తెలుసుకోలేని అజ్ఞానులు కారని తెలుసుకోవాలి.