లోక్‌సభతో పాటే 11 రాష్ట్రాలకు ఎన్నికలు !

జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ ఆ దిశగా వేగంగా పావులు కదుపుతున్నది. జమిలి ఎన్నికల అవసరాన్ని స్పష్టం చేస్తూ లా కమీషన్ చైర్మన్ కు బిజెపి అద్యక్షుడు అమిత్ షా లేఖ కుడా పంపారు. వచ్చేఏడాది తొలి అర్ధభాగంలో జరిగే లోక్‌సభ ఎన్నికలతోపాటు తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలనూ నిర్వహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

 

బీజేపీ ఆలోచన ప్రకారం లోక్‌సభతోపాటు 10 నుంచి 11 రాష్ర్టాల అ సెంబ్లీలకూ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తున్నది. లోక్‌సభ కంటే కొన్ని నెలల ముందు లేదా కొన్ని నెలల తర్వాత జరిగే రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభతోపాటే నిర్వహణకు ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తునండి. బిజెపి పాలనలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీల గడువు వచ్చేఏడాది జనవరితో ముగుస్తున్నా, కొద్దినెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికలతోపాటు ఈ రాష్ర్టాల ఎన్నికల నిర్వహణకు గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. కొన్నినెలలపాటు ఆ రాష్త్రాలలో రాష్ట్రపతి పాలన విధించవలసి రావచ్చు.  

మరోవైపు లోక్‌సభ ఎన్నికల తర్వాత కొద్దినెలల్లో ఎన్నికలు జరుగనున్న హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ బీజేపీ ఏలుబడిలోనే ఉన్నాయి. ఎట్లాగు ఆరు నెలల ముందే ఎన్నికలు జరిపే సౌలభ్యం ఉండడంతో వాటిల్లో ముందుగానే ఎన్నికలు జరపడానికి ఎటువంటి సమస్య ఎర్పదబోడు. ఇక ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిశా అసెంబ్లీల గడువు ఎటూలోక్‌సభతోపాటే ముగుస్తుంది. దానితో లోక్‌సభతో పాటు ఈ రాష్ర్టాల్లో ఎన్నికల నిర్వహణకు ఎటువంటి సమస్యా ఏర్పడదు.

ఇక, 2020లో ఎన్నికలు జరిగే బీహార్‌లోనూ ముందస్తు ఎన్నికల నిర్వహణకు చర్చలు జరుగుతున్నాయి. బీహార్‌లో ముందస్తు ప్రతిపాదనను ప్రధాన భాగస్వామి జేడీయూ విముఖత వ్యక్తం చేస్తున్నా జమిలి ఎన్నికల వల్ల లబ్ది చేకూరే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భావిస్తున్నారు. దానితో ఆయన సహితం ఒకేదాది ఎన్నికలకు సిద్దపడే అవకాశం లేకపోలేదు.

మరోవంక రాజకీయ పరిస్థితి అనిశ్చితంగా ఉన్న తమిళనాడులో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకు రావడానికి దినకరన్ వర్గం ప్రయత్నిస్తున్నది. 19 మంది ఎంఎల్యేల అనర్హత విషయం హై కోర్ట్ తెల్చితే ఆక్కడ రాజకీయ సంక్షోభకర పరిస్థితులు పరిస్థితి ఏర్పడి మధ్యంతర ఎన్నికలకు దారితీసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.