సిఎం రమేష్ పై ఐటీ సోదాలతో లోకేష్ ఉలిక్కి పాటు !

సొంతంతెలుగు దేశం పార్టీ రాజ్యసభ్య సభ్యుడు సిఎం రమేష్ నివాసాలపై రెండు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు జరుపుతూ ఉండడంతో టిడిపి నేతలు అందరూ ఉలిక్కి పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఈ దాడులపై తీవ్రంగా స్పందించారు. అంతకు ముందు సరిగ్గా రెండు రోజుల క్రితం మాజీ కేంద్ర మంత్రి సుజన చౌదరి సంబంధించిన సంస్థల్లో, నివాసాలలో  ఈడీ పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. పెద్ద ఎత్తున పాత్రలను స్వాధీనం చేసుకున్నారు.

అయినా తెలుగు దేశం పార్టీ నేతలు ఎవ్వరు ఈ సోదాలపై స్పందించనే లేదు. సుజనా చౌదరి సహితం ఈ విషయమై మీడియాలో ఎటువంటి వాఖ్యలు చేయలేదు. కాని ఇప్పుడు సిఎం రమేష్ పై సోదాలు అనగానే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు ? ఈ విషయమై టిడిపి వర్గాలలోనే విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.

 వాస్తవానికి తెలుగు దేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి ఆర్ధికంగా అండగా ఉండి నడిపించిన సుజన చౌదరి, 2014లో పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర వహించారు. సిఎం రమేష్ అయితే 2009లో చంద్రబాబునాయుడుపై వత్తిడి తెచ్చి కెసిఆర్ తో పొత్తుకు ఒప్పించిన కారణంగా పార్టీ రాజకీయంగా తీవ్రంగా నష్ట పోయింది.

ఈ సందర్భంగా రమేష్ పై జరిపిన సోదాలు బినామి ఆస్తులు కావడంతో లోకేష్ తీవ్రంగా స్పందిస్తున్నారా అంటూ బిజెపి అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహరావు ప్రశ్నించడం టిడిపి వర్గాలలో తీవ్ర కలకలం రేపుతున్నది. లోకేష్-రమేష్ ల మధ్య ఆర్ధిక సంబంధాలు ఉన్నాయనే అనుమానాలకు దారితీస్తున్నది.

 టిడిపిలో కీలకంగా ఉంటూనే మరోవంక వైసిపి నేతలతో, టి ఆర్ ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఎర్పర్చుకొంటున్న రమేష్ ఆర్ధిక వ్యవహారాలపై చూపుతున్న శ్రద్ద పార్టీ వ్యవహారాలపై చూపడం లేదని విమర్శలు చెలరేగుతున్నాయి. సొంత జిల్లా కడపలో బలమైన పార్టీ నాయకులు అందరిని బలహీన పరచే ప్రయత్నం చేస్తున్నారని అంటూ టిడిపి నేతలే బహిరంగ విమర్శలకు ఇంతకు ముందు దిగడం గమనార్హం.

కోట్లాది రూపాయల కాంట్రాక్టులను నామినేషన్ పద్ధతిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రమేష్ కు ధారాదత్తం చేస్తూ ఉండటం వెనుక బినామి లావాదేవీలు ఉన్నాయా ? అవి ఇప్పుడు బైట పడతాయని భయపడుతున్నారా ? అనే సందేశాలు కలుగుతున్నాయి. ఏ శాఖలో అయినా పది లక్షల రూపాయలకు మించిన పనులు నామినేషన్ పై ఇవ్వటానికి వీల్లేదు. అట్లా ఇవ్వడం సాధ్యం కాదు కుడా.  

కానీ సీఎం రమేష్ కు చెందిన కంపెనీలకు ఏకంగా చంద్రబాబు ప్రభుత్వం రూ 1156 కోట్ల విలువ చేసే పనులను నామినేషన్ పై అప్పగించింది. అందుకు అన్ని నిబంధనలను అడ్డదిడ్డంగా ఉల్లంగించిన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కుడా ఇంత అడ్డదిడ్డంగా పనులను అనుకున్న వారికి అప్పగించిన దాఖలాలు లేవని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

హంద్రినీవా ఫేజ్ 2లో 2,4,5,6 ప్యాకేజీలకు సంబంధించిన రూ 1000 కోట్ల పనులను నామినేషన్ పైనే సీఎం రమేష్ కంపెనీలకు కట్టబెట్టారు. దీంతో పాటు గాలేరు-నగరిలో రూ 156 కోట్ల విలువ చేసే 26 ప్యాకేజీ పనులను కూడా నామినేషన్ పైనే ఇచ్చారు. వేల కోట్ల రూపాయల పనులను నామినేషన్ పై ఇవ్వటం ఆర్ధిక, సాగునీటి శాఖల ఉన్నతాదికారులకే ఆశ్చర్యం కలిగిస్తున్నది.

సీఎం రమేష్ పై ఐటి సోదాలు ప్రారంభం కాగానే నారా లోకేష్ తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా  స్పందించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ దీక్ష చేసి వంద రోజులు పూర్తి అయిన రోజుననే కక్షసాధింపుగా ఈ సోదాలు జరిపారనే అర్ధం వచ్చేటట్లు ఆయనతో పాటు చంద్రబాబునాయుడు కుడా విమర్శలు గుప్పించారు.

కేంద్ర ప్రభుత్వం ముందుకు రాని పక్షంలో, రెండు నెలల పాటు వేచి చూసి రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణం చేబడుతుందని రమేష్ నిరాహార దీక్ష విరమణ సందర్భంగా స్వయంగా చంద్రబాబునాయుడు ప్రకటించారు. కాని ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కడుగు కుడా ముందుకు వేయక పోవడం గమనార్హం.

అసలు ఆర్ధిక నేరాల నుండి రక్షణ కోసమే ఎన్నడూ జనంతో సంబంధం లేని రమేష్ ఉక్కు ఫ్యాక్టరీ కోసం అంటూ నిరాహార దీక్షకు దిగిన్నట్లు ఇప్పుడు టిడిపి వర్గాలే భావిస్తున్నాయి. ఈ సొదల పట్ల టిడిపి అగ్రనయకులే ఉలిక్కి పడటం చూస్తుంటే బినామీ లావాదేవీలు భారీగా జరిగిన్నట్లు భావించవలసి వస్తున్నది. దానితో అనుమానాలు అన్ని `యువనేత’ లోకేష్ పైకి వెడుతున్నాయి.