పార్టీని విమర్శించిన సంజయ్ జాకు కాంగ్రెస్ ఉద్వాసన 

పార్టీ నాయకత్వం తీరుతెన్నులను విమర్శిస్తూ ఒక ప్రముఖ దినపత్రికలో వ్యాసం వ్రాసిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ జాను  పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ పదవి నుండి తొలగించారు. 

"కాంగ్రెస్ పార్టీ అసాధారణమైన నిరుత్సాహాన్ని ప్రదర్శించింది. పార్టీని పునర్జీవింప చేయడం కోసం తీవ్రమైన  ప్రయత్నం జరగలేదు" అంటూ ఆ వ్యాసంలో పార్టీ అధిష్ఠానం నిర్వాకంపై విరుచుకు పడ్డారు. 

'టైమ్స్ ఆఫ్ ఇండియా' లోని ప్రచురించిన ఈ వ్యాసంలో "పార్టీలో చాలా  మంది ఉన్నారు, వారు ఈ నిర్లక్ష్యతను అర్థం చేసుకోలేరు" అంటూ పార్టీ నాయకత్వం క్రియాశున్యతను ప్రస్తావించారు. .

గాంధేయ తత్వశాస్త్రం, కాంగ్రెస్‌ను నిర్వచించే నెహ్రూవియన్ దృక్పథంతో శాశ్వతంగా బంధం ఏర్పర్చుకున్న తన వంటి వ్యక్తికి ఈ పార్టీ బాధాకరమైన విచ్ఛిన్నతను చూడటం భయభ్రాంతులకు గురిచేస్తోందని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

'ఆయన చేసిన విమర్శలు నేరుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తగిలేవిధంగా ఉండడంతో పార్టీ నాయకత్వం ఒక విధంగా షాక్ కు గురైనది.