ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనాతో ముప్పు

ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా వైరస్ తో ఎక్కువ ముప్పు కలిగి వున్నది. గుండె జబ్బులు, మధుమేహం వంటి వేరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిలో కొవిడ్-19 తొందరగా ప్రభావితం చేస్తుందని ఇటీవలి అధ్యయనంలో తేలింది.

లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ నిర్వహించిన ఈ అధ్యయనం నివేదికను లాన్సెట్ పత్రికలో ప్రచురించారు. ఈ అధ్యయనం ప్రకారం.. ఇతర జబ్బులతో బాధపడుతున్న వారు ప్రపంచ జనాభాలో దాదాపు 20 శాతం మంది అంటే 170 కోట్ల మంది ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇలాంటి వారు టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు వంటివి కలిగివుంటే తీవ్రత మరి కొంచెం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు దీర్థకాలిక మూత్రపిండాల వ్యాదితోగానీ, తీవ్ర శ్వాస సమస్యతోగానీ, ఇతరత్రా తీవ్ర వ్యాధులతోగానీ బాధపడుతుంటే కూడా కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. 

ఆఫ్రీకా దేశంలో కన్నా యూరప్ లో కరోనాతో ఎక్కువ ప్రమాదం ఉన్నదని తేల్చారు. యూరప్ దేశాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నందున కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 

ఇలా ఉండగా, ఇప్పటివరకు ప్రపంచ దేశాల్లో 80 లక్షల మందికి కరోనా వైరస్ సోకినట్లు గణాంకాలు చెప్తున్నాయి. భారత్లో కేసుల సంఖ్య 3,43,091 కి చేరుకొన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.