అల్‌ఖైదా చీఫ్‌ అబ్దుల్‌ మాలిక్‌ మృతి

ఫ్రాన్స్‌ దేశంలోని ఉత్తరమాలిలో ఫ్రెంచ్‌ సైనిక దళాలు జరిపిన దాడిలో అల్‌ఖైదా చీఫ్‌ అబ్దుల్‌ మాలిక్‌ మరణించారు. కరుడుగట్టిన ఉగ్రవాది, ఉత్తర ఆఫ్రికా అల్‌ఖైదా చీఫ్‌ అయిన అబ్దుల్‌ మాలిక్‌ కోసం ప్రెంచ్‌ సైన్యం ఏడేళ్లుగా గాలిస్తోంది.

ఉత్తర మాలి, నైజర్‌, మౌరిటానియా, అల్జీరియా ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న అబ్దుల్‌మాలిక్‌ ఉత్తర అల్జీరియాలో దాక్కున్నట్లు ఫ్రెంచ్‌ సైన్యం సమాచారం అందుకుంది. దీంతో మాలి సైన్యంతో సైన్యంతో కలిసి ఉత్తరమాలి, అల్జీరియా తదితర ప్రాంతాల్లో ఫ్రెంచ్‌ సైనికులు ఏకకాలంలో దాడులు జరిపారు. 

ఈ దాడిలో అబ్దుల్‌ మాలిక్‌ తో పాటు అతను సహచరులు పలువురు సహితం  మరణించినట్లు ఫ్రెంచ్‌ సాయుధ దళాల మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీ శుక్రవారం రాత్రి ట్విటర్‌లో తెలిపారు.  స్థానిక దళాల సహకారంతో ఈ ఉగ్రవాదులను తాము వేటాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. 

2013లో ఫ్రెచ్ సేనల జోక్యానికి ముందు ఉత్తర మాలిని ఇస్లామిస్ట్ తీవ్రవాదులు ఆక్రమించుకోవడంలో మాలిక్ కీలక పాత్ర వహించారు. వారిని ఫ్రెంచ్ సేనలు గెంటి వేయడంతో   తీవ్రవాదులు   సాహిల్  ప్రాంతంలో చెల్లాచెదురై ఉన్నారు. 

గతంలో ఆఫ్ఘానిస్తాన్ లో సోవియట్ సేనలపై దాడులు జరిపాడు. అతని ఆధ్వర్యంలో అనేక విధ్వసాలకు పాల్పడ్డారు. బుర్కినా ఫాసో రాజధానిలో 2016లో ఒక హోటల్ పై దాడి చేసి 30 మంది మరణానికి, 150 మంది గాయపడడానికి కారకుడు. 

అల్జెరియా రాజధానిలో 2007లో మూడు బాంబు దాడులు జరిపి 22 మంది చనిపోవడానికి, 200 మందికి పైగా గాయపడడానికి కారణమైన అతనికి 2012లో అల్జీరియా కోర్ట్ అతను పట్టుబడకుండానే మరణ శిక్ష విధించింది.