ఆప్ లోకి నవజ్యోత్ సింగ్ సిద్దూ !

కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ఆమ్‌ఆద్మీలో చేరడానికి  తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. అందుకోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ ఈ మేరకు చర్చలు జరిపినట్లు తెలిసింది. 

పంజాబ్‌ 2022 లో ఎన్నికల గోదాలోకి దిగబోతోంది. గతంలో బిజెపి నేతగా ఉన్న సిద్దు అకాళీ దళ్ తో పొత్తు తెంచుకొని, సొంతంగా పోటీ చేయాలనీ, తనను సీఎం అభ్యర్హ్దిగా ప్రకటించాలని బిజెపి నాయకత్వంపై వత్తిడి తెచ్చారు. అందుకు బిజెపి ఒప్పుకొనక పోవడంతో కాంగ్రెస్ లోకి వెళ్లారు. 

అయితే కాంగ్రెస్ లో బలమైన కెప్టెన్ అమరిందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉండడంతో సిద్ధుకు పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. బీజేపీలో సిద్దు ఎంపీగా, ఆయన భార్య ఎమ్యెల్యేగా ఉండేవారు. కానీ కాంగ్రెస్ లో సిద్ధుకు ఎమ్యెల్యే  సీట్ తప్ప భార్యకు సీట్ లభించలేదు. 

రాహుల్ గాంధీ మద్దతు ఉన్నా సీఎం లెక్క చేయడం లేదు. మంత్రి పదవి లభించినా కీలకమైన శాఖలు లభించలేదని అసంతృప్తిలో ఉంటూ వచ్చారు. పైగా తన మంత్రిత్వ శాఖ పట్ల దృష్టి సారించడం లేదని రాజీనామా చేయమనడంతో మంత్రిపదవి కోల్పోవలసి వచ్చింది.  

ఈ లోగా పాకిస్థాన్ తో భారత్ సంబంధాలు ప్రతికూలంగా ఉన్న సమయంలో సీఎంను కాదని ప్రధాని ఇమ్రాన్ సింగ్ ప్రమాణస్వీకారంకు వెళ్లడం, ఆ తర్వాత కూడా పలుశాలురు వివాదాస్పద ప్రకటనలు చేయడంతో సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తుండేవారు. 

 కొంతకాలంగా రాజకీయాలలో క్రియాశీలకంగా కనిపించడం లేదు. అటువంటి తరుణంలో ఆప్ లో చేరితే సీఎం అభ్యర్థిగా ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. 2012లో పంజాబ్ లో ప్రధాన ప్రతిపక్షంగా గెలుపొందిన ఆప్ 2014లో నాలుగు ఎంపీ స్థానాలు గెలుపొందింది. 2017లో అధికారంలోకి వస్తే కేజ్రీవాల్ సీఎం కాగలరని కధనాలు కూడా వచ్చాయి. 

అయితే క్రమంగా ఆప్ బలహీనమవుతూ వచ్చింది. ముఖంగా ఆకర్షణీయమైన సీఎం అభ్యర్థి లేకపోవడమే కారణంగా భావిస్తున్నారు. అందుకనే కేజ్రీవాల్ సిద్దుపై ద్రుష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు. 2016 లోనే బీజేపీ నుంచి బయటకు రాగానే ఆప్‌లో చేరాలని భావించారు. చివరికి కాంగ్రెస్ గూటికి చేరారు

అయితే ఈ వార్తలను పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఖండిస్తున్నారు. సిద్దూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని, ఆప్‌లో చేరబోరని ఆయన ప్రకటించారు.