త్వరలో మరో ‘మేడిన్‌ ఇండియా’ ఫైటర్‌ జెట్‌ 

మరో ‘మేడిన్‌ ఇండియా’ ఫైటర్‌ జెట్‌ త్వరలో అందుబాటులోకి రానున్నది. దేశీయంగా తయారు చేసిన తేలికపాటి సింగిల్‌ ఇంజిన్‌ యుద్ధ విమానం తేజస్‌-ఎన్‌ ఇటీవల ఐఎస్‌ఎస్‌ విక్రమాదిత్యపై విజయవంతంగా ట్రైల్‌ ల్యాండ్‌ పూర్తి చేసింది. 

ఈ నేపథ్యంలో ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ), రెండు ఇంజిన్ల ఫైటర్‌ జెట్‌ తయారీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మే 22న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో జరిగిన నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ల సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది.

 ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్‌’ లక్ష్యాల్లో భాగంగా భారత రక్షణ దిగుమతులను గణనీయంగా తగ్గించుకుని దేశీయ తయారీ రంగంపై దృష్టిసారించాలని నిర్ణయించారు. 

ఈ నేపథ్యంలో రెండు యుద్ధ విమాన వాహక నౌకలు ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య, త్వరలో నౌకాదళంలో ప్రవేశపెట్టనున్న ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై మోహరించేలా ఓ నమూనా యు ద్ధవిమానాన్ని సిద్ధం చేయనున్నారు. 

మరో ఆరేండ్లలో దీన్ని తయారు చేయడంపాతోటు పదేండ్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. మిగ్‌-29 స్థానంలో వీటిని భర్తీ చేయనున్నారు.