2,500 మంది మహా పోలీసులకు కరోనా, 30మంది మృతి 

దేశం మొత్తం మీద కరోనా ఉధృతంగా ఉన్న మహారాష్ట్రలో పోలీసులు సహితం పెద్ద సంఖ్యలో ఈ వైరస్ కు గురవుతున్నారు. ఇప్పటికి సుమారు 2,500 మంది గురయ్యారని, వారిలో ఒక సీనియర్ అధికారితో పాటు 30 మంది చని పోయారని చెబుతున్నారు. మృతులలో ఎక్కువగా 18 మంది కేవలం ముంబై పోలీసు బలగాలలో పనిచేస్తున్న వారే. 

 ప్రస్తుతానికి పోలీస్ శాఖలో 191 మంది అధికారులతో సహా 1,510 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని తెలిపారు. లాక్​డౌన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు నిబంధనల ఉల్లంఘన ఘటనల్లో 1,22,484 కేసులు నమోదు చేశామని, ఈ కేసుల్లో 28,820 మందిని అరెస్టు చేశామని చెప్పారు. 

నిబంధనలు పాటించకుండా రోడ్లమీదకు వచ్చిన 77,435 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ సమయంలో రూ  6.38 కోట్ల జరిమానాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 72 వేలు దాటగా.. 2465 మంది మృత్యువాత పడ్డారు.