గ్రేటర్ లో ప్రతి 100 టెస్టులకు 10 పాజిటివ్

లాక్​డౌన్ సడలింపులతో గ్రేటర్​ హైదరాబాద్ లో కరోనా కేసుల ఉదృతి ఆందోళనకరంగా మారింది. 100 మందికి టెస్ట్​లు చేస్తే 10 మందికి పాజిటివ్‌ వస్తోంది. నెల కిందట చూస్తే 5.1 శాతంగా ఉన్న పర్సంటేజీ దాదాపు రెట్టింపయింది. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్​లు, పరిసర ప్రాంతాల ప్రజలకు వైరస్ ​వ్యాపించి ఉంటుందని, టెస్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని మునిసిపల్  అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

పాజిటివ్స్​ వచ్చిన ఏరియాల్లో హెల్త్‌ ఆఫీసర్లు, పోలీసులు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్​ను గుర్తిస్తున్నారు. ఆరోగ్య కార్యకర్తలతో ఇంటింటి ​ సర్వే చేయిస్తున్నారు. సింప్టమ్స్​ఉన్నవారిని గాంధీ, నిమ్స్​కు టెస్ట్​ల కోసం పంపుతున్నారు. పాజిటివ్‌ వస్తే చేర్చడం, నెగిటివ్‌ వస్తే హోం క్వారంటెయిన్​లో ఉంచుతున్నారు.

గ్రేటర్​లో​ ప్రైమరీ కాంటాక్స్​ అందరికీ టెస్టులు  చేయడం లేదు.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తరచూ నిబంధనలు మారుస్తుండడంతో స్పష్టత  ఉండడం లేదని అధికారులు వాపోతున్నారు. ఇటీవల కూకట్‌పల్లిలో పాజిటివ్‌ వచ్చిన అంతని కుటుంభంలో ముగ్గురు ప్రైమరీ కాంటాక్ట్​లకు టెస్ట్​లు చేయగా అందరికీ కరోనా సోకినట్లు తేలింది. మరో పాజిటివ్‌  వ్యక్తి ఫ్యామిలీలో  ముగ్గురు ప్రైమరీ కాంటాక్ట్‌లకు టెస్ట్​లు చేస్తే నెగిటివ్‌ వచ్చింది. 

వైరస్​ బారిన పడ్డ 80 శాతం మందిలో సింప్టమ్స్ కనిపించడం లేదు. టెస్ట్​ల​ సంఖ్య  పెంచడంతోనే  కరోనా కట్టడి సాధ్యమని బల్దియా అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం టెస్ట్ లను తగ్గిస్తూ వస్తున్నది. దానితో నగరంలో వైరస్ సామజిక వ్యాప్తి జరిగిన అనే అనుమానాలు కలుగుతున్నాయి.