భారత్ లో కరోనా పరిస్థితి చాలా మెరుగు!

భారత్ లో కరోనా కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువై,  ప్రతిరోజూ పాజిటివ్‌ కేసుల సంఖ్య 8 వేలకు తగ్గకుండా, మృతుల సంఖ్య రోజుకు 200 దాటుతు ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్‌ మెరుగైన స్థితిలోనే ఉన్నది. దేశ జనాభా నిష్పత్తితో వైరస్‌ కేసులను, రికవరీ రేటును విశ్లేషిస్తే వైరస్‌ వ్యాప్తి దేశంలో ఇంకా కట్టడిలోనే ఉన్నట్టు అర్థమవుతున్నది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల్లో భారత్‌ ఏడో స్థానంలో ఉన్నది. అయితే, జనాభాతో కేసుల నిష్పత్తిని విశ్లేషిస్తే భారత్‌ 144వ స్థానంలో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 లక్షల మందికి సగటున 821 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయితే దేశంలో ప్రతి 10 లక్షల మందిలో కేవలం 145 మందికి మాత్రమే వైరస్‌ సోకింది.

దేశ జనాభా 138 కోట్లు. వైరస్‌ మృతులు 5,598. భారత్‌తో సమానమైన జనాభా కలిగిన మొత్తం 14 దేశాల్లో (ఈ 14 దేశాల్లోని జనాభా మొత్తాన్ని కలిపితే 138 కోట్లు) ఇప్పటివరకూ నమోదైన కొవిడ్‌-19 మరణాలు దాదాపు మూడు లక్షలు. దేశంలో నమోదైన వైరస్‌ మృతుల సంఖ్యతో పోలిస్తే ఇది 55.2 రెట్లు ఎక్కువ.

ప్రపంచంలో ప్రతి లక్ష మందిలో 4.9 శాతం మంది వైరస్‌తో మరణిస్తుంటే, మన దేశంలో ఇది 0.41 శాతంగా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా మరణాలు సుమారు 6.19 శాతం కాగా మన దేశంలో కేవలం 2.83 శాతమే. అమెరికా, బ్రెజిల్‌, రష్యా, బెల్జియం తదితర దేశాల్లో సగటున ప్రతి 300 మందిలో ఒక్క వైరస్‌ కేసు నమోదు అవుతుంటే, దేశంలో ప్రతి 7 వేల మందిలో ఒక్క కేసు మాత్రమే నమోదవుతున్నది. 

వైరస్‌బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతున్నది. ఏప్రిల్‌ 15 నాటికి దేశంలో రికవరీ రేటు 11.42 శాతంగా ఉన్నది. అయితే, మంగళవారం నాటికి  అది 48.07 శాతానికి చేరింది. దీన్నిబట్టి స్థూలంగా వైరస్‌ సోకిన ప్రతి ఇద్దరిలో ఒకరు రికవరీ అవుతున్నట్టు అర్థమవుతున్నది. ఇదే సమయంలో అమెరికా, బ్రెజిల్‌, బెల్జియం దేశాల్లో నమోదైన రికవరీ రేటుతో పోలిస్తే భారత్‌ ఎంతో ముందున్నది.

దేశంలో నమోదవుతున్న మొత్తం కొవిడ్‌-19 మరణాల్లో 73 శాతం మరణాలు ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారికి సంబంధించినవేనని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ప్రతి రెండు వైరస్‌ మరణాల్లో ఒకరు సీనియర్‌ సిటిజన్‌ అని వెల్లడించారు. మరోవైపు,