శ్వేత సౌధం  బంక‌ర్‌లో దాగిన ట్రంప్‌!

న‌ల్ల‌జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ను పోలీసులు చంపిన కేసులో అమెరికా అత‌లాకుత‌ల‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం కూడా వాషింగ్ట‌న్ డీసీలో భారీ స్థాయిలో ఆందోళ‌న‌లు మిన్నంటాయి. అధ్య‌క్ష అధికార భ‌వ‌నం శ్వేత సౌధం వ‌ద్ద కూడా నిర‌స‌న‌లు హోరెత్తాయి.  

దావాన‌లంలా ఆందోళ‌న‌లు హోరెత్త‌డంతో.. వైట్‌హౌజ్‌లో ఉన్న అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ఆ నివాసంలో ఉన్న అండ‌ర్‌గ్రౌండ్‌ బంక‌ర్‌లోకి తీసుకువెళ్లిన‌ట్లు తెలుస్తున్న‌ది. అమెరికా దిన‌ప‌త్రిక ద న్యూయార్క్ టైమ్స్  దీని గురించి ఓ క‌థ‌నం రాసింది.  

బంక‌ర్‌లో దాగిన ట్రంప్‌ సుమారు అక్క‌డ గంట సేపు గ‌డిపిన‌ట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాత ఆయ‌న్ను మ‌ళ్లీ పై అంత‌స్తు‌కు తీసుకువ‌చ్చారు.  శుక్ర‌వారం వంద‌ల సంఖ్య‌లో ఆందోళ‌న‌కారులు వైట్‌హౌజ్‌ను చుట్టుముట్టారు. 

సీక్రెట్ స‌ర్వీస్‌, యూఎస్ పార్క్ పోలీసు ఆఫీస‌ర్లు వారిని నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. శ్వేత‌సౌధం వ‌ద్ద జ‌రిగిన నిర‌స‌న‌ల‌ను ఉధృతిని చూసి అధికారులు షాక‌య్యారు. 

మిన్నియాపోలిస్‌లో జార్జ్ ఫ్లాయిడ్ అనే న‌ల్ల‌జాతీయ వ్యక్తిని ఓ శ్వేత‌జాతి పోలీసు గొంతు నొక్కి చంపిన విష‌యం తెలిసిందే. మార్చి 25వ తేదీ నుంచి అమెరికా దేశ‌వ్యాప్తంగా హింసాత్మ‌క ఆందోళ‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. 

వాషింగ్టన్ డిసితో పాటు 40 ప్రధాన నగరాలు పట్టణాలలో కర్ఫూ విధించినట్లు అధికారులు తెలిపారు.  ఆందోళన తీవ్రత ఎక్కువగా ఉన్న 15 రాష్ట్రాలలో ఇప్పటికీ 5వేల తో మంది జాతీయ భద్రతా దళ సిబ్బందిని రంగంలోకి దింపినట్లు దళం ఉన్నతాధికారి జోసెఫ్ లెంగ్యల్ తెలిపారు.