హాంగ్ కాంగ్ పై విశ్వ కూట‌మి .. బ్రిటన్ ప్రధానిపై వత్తిడి  

హాంగ్ కాంగ్ అంశంలో విశ్వ కూట‌మి ఏర్పాటు చేయాల‌ని  బ్రిట‌న్‌కు చెందిన మాజీ విదేశాంగ మంత్రులు.. ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌ను ఓ విజ్క్ష‌ప్తి చేశారు. హాంగ్ కాంగ్ విష‌యంలో అంత‌ర్జాతీయంగా బ్రిట‌న్ ముందుండి పోరాడాల‌ని మాజీ మంత్రులు కోరారు. కాగా, హాంగ్ కాంగ్ అంశాన్ని గుడ్డిగా వ‌దిలేయ‌లేమ‌ని విదేశాంగ మంత్రి డామినిక్ రాబ్ స్పష్టం చేశారు. 

హాంగ్ కాంగ్ ఒక‌ప్పుడు బ్రిటీష్ ఆధీనంలో ఉండేది.  1997లో హాంగ్ కాంగ్‌ను చైనాకు అప్ప‌గించారు.  కానీ అప్పుడు ఆ న‌గ‌రానికి కొంత స్వేచ్ఛ ఉండేది.  ఇప్పుడు ఆ న‌గ‌రంపై చైనా ఆధిప‌త్యాన్ని చెలాయిస్తున్న‌ది. అంతేకాదు, తాజాగా హాంగ్‌కాంగ్ ర‌క్ష‌ణకు సంబంధించిన ఓ క‌ఠిన చ‌ట్టాన్ని చైనా త‌యారు చేసింది.  ఆ చ‌ట్టం ఆమోదం కూడా పొందింది.  

ఈ నేప‌థ్యంలో బ్రిట‌న్ హాంగ్‌కాంగ్ సంక్షోభం ఓ కొత్త నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. చైనాకు హాంగ్‌కాంగ్‌ను అప్ప‌గించిన‌ప్పుడు కొన్ని ప్రాథ‌మిక చ‌ట్టాలు అమ‌లులో ఉండేవి. వాటికి ఇప్పుడు విఘాతం ఏర్ప‌డుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. సైనో-బ్రిటీష్ ఒప్పందాల‌ను ఉల్లంఘిస్తున్నార‌ని మాజీలు ఆరోపించారు. 

 బ్రిట‌న్ మాజీ విదేశాంగ మంత్రులు డేవిడ్ మిలిబ్యాండ్‌, జాక్ స్ట్రా, విలియ‌మ్ హేగ్‌, మాల్క‌మ్ రిఫ్‌కైండ్‌, డేవిడ్ ఓవెన్‌, మార్గ‌రేట్ బెక‌ట్‌లు ప్ర‌ధాని బోరిస్‌కు త‌మ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చైనాపై ఎటువంటి చ‌ర్య తీసుకోవాల‌న్నా దాని కోసం ఓ అంత‌ర్జాతీయ గ్రూపును ఏర్పాటు చేయాల్సి ఉంటుంద‌ని మాజీ మంత్రులు బోరిస్‌ను కోరారు.