ఏపీలో 18స్టేషన్లో మాత్రమే రైళ్ల రాక!

70 రోజుల వ్యవధి తర్వాత రైళ్ల రాకపోకలు ప్రారంభమైనా ముందు జాగ్రత్త చర్యగా ఏపీలో 18 స్టేషన్లో మాత్రమే రైళ్లను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  71 స్టేషన్లలో హెల్త్‌ ప్రొటోకాల్‌ పాటించడం సాధ్యం కాదని అంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌కు ఓ లేఖ కూడా రాశారు.

రాష్ట్రానికి సోమవారం నుంచి 22 రైళ్లు రానున్నాయి. హైరిస్క్‌ నగరాలు చెన్నై, ముంబై, హైరిస్క్‌ రాష్ట్రాలు గుజరాత్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ల నుంచి వచ్చేవారిని ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతారు. తర్వాత వారిని హోమ్‌ క్వారంటైన్‌కు పంపుతామని  కొవిడ్‌ ప్రత్యేక అధికారి ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. 

గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌(గుంటూరు-సికింద్రాబాద్‌)నే స్పెషల్‌ ట్రైన్‌గా మార్పు చేసి రైల్వేశాఖ  ప్రారంభించింది.  హైదరాబాద్‌-విశాఖ గోదావరి ఎక్స్‌ప్రె్‌సను విజయవాడ, రాజమండ్రిలలోనే ఆపాలని,  . గుంటూరు-సికింద్రాబాద్‌ గోల్కొండ ఎక్స్‌ప్రె్‌సను విజయవాడలో, తిరుపతి-నిజామాబాద్‌ రాయలసీమ ఎక్స్‌ప్రె్‌సను కడప, గుంతకల్‌లో, విశాఖ-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను రాజమండ్రి, విజయవాడలో, ముంబై-భువనేశ్వర్‌ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ, విశాఖపట్నంలలో ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.