జి7 సమావేశానికి భారత్‌, రష్యాకు ఆహ్వానం

ఈ ఏడాది జూన్‌లో జరగాల్సిన జి7 దేశాల సమావేశం కాస్త ఆలస్యమౌతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. అంతేకాక ఈసారి సమావేశాలకు భారత్‌,రష్యాతోపాటు ఆస్ట్రేలియా, దక్షిణకొరియాను కూడా ఆహ్వానిస్తానని ట్రంప్‌ ప్రకటించారు. 

''ప్రపంచంలో ఏ జరుగుతుందో అనే దాన్ని జి7 గ్రూపు ప్రతిబింబిస్తోందని నేను అనుకోవడం లేదు. ఇది చాలా అవుట్‌డేటేడ్‌ దేశాల గ్రూపు'' అని పేర్కొన్నారు. ఈసారి జి7 దేశాల సదస్సుకు అమెరికా అధ్యక్షత వహిస్తున్నందున కొత్త దేశాలను ఆహ్వానించే అవకాశం ఆ దేశానికి ఉంది. 

జి7 సమావేశం సెప్టెంబర్‌లో గానీ ఐక్యరాజ్యసమతి సర్వసభ్య సమావేశానికి కాస్త అటో ఇటో ఉండే అవకాశముందని, సమావేశం క్యాంప్‌ డేవిడ్‌లో జరుగుతుందని ట్రంప్‌ తెలిపారు. జి7 గ్రూపులో సభ్యులైన అభివృద్ది చెందిన దేశాలైన బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జపాన్‌, జర్మనీ, అమెరికా, ఇటలీ, కెనడాలు ప్రతి ఏడాది సమావేశమైన అంతర్జాతీయ ఆర్ధిక సహాకారంపైన చర్చించుకుంటారు.