కార్మిక సంస్కరణలు కావు.. కార్మిక చట్టాల సమాధి 

* బిఎంఎస్ అధ్యక్షుడు సీకే సాజి నారాయణన్ 

* వలసల సమస్యలు తెరపైకి రావడం మంచిది 

చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చివరకు వలస కార్మికుల ఇబ్బందుల పట్ల స్పందిస్తుండటం పట్ల దేశంలో అతిపెద్ద కార్మిక సంఘమైన భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) జాతీయ అధ్యక్షుడు సీకే  సాజి  నారాయణన్  సంతోషం వ్యక్తం చేశారు.

అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలలో తీసుకు వస్తున్న మార్పులు కార్మిక సంస్కరణలు కావని, "మూకుమ్మడిగా కార్మిక చట్టాలను సమాధి చేయడం" అని అవుట్ లుక్ ప్రతినిధి లోల నాయర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విమర్శించారు. ఇంటర్వ్యూలోని అంశాలు: 

* ప్రస్తుత తరుణంలో ఆర్ధిక వ్యవస్థ, పరిశ్రమలు, ఉపాధి, కార్మికులకు ఏది అతిపెద్ద సవాల్ గా మీరు భావిస్తున్నారు?

- మొత్తం ప్రపంచం ప్రధానమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఈ మహమ్మారి కారణంగా 52 శాతం ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం ఉన్నదని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఇఎల్ఓ) జోస్యం చెప్పింది. అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థలో దాదాపు స్థబ్ధత నెలకొన్నదని, పలు దేశాలు మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయని ప్రపంచ బ్యాంకు కూడా చెప్పింది. 

కానీ మనం చాల ఇతర దేశాలకన్నా మెరుగ్గా పరిష్టితులను నియంత్రించ గలగడంతో భారత్ అంత తీవ్రంగా ప్రభావితం కాకపోవచ్చు. భారత దేశంలో మొదటి నుండి మనం మానవ జీవితాలకు ప్రాధాన్యత ఇచ్చి వ్యాపారాలను మూసివేసాము. మన దేశంలో తక్కువగా మరణాలు ఉండడానికి ఇదొక్క కారణం. కానీ దురదృష్టవశాత్తు ఈ సంక్షోభం ఇంకా ముగియలేదు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. 

*పెద్ద ఎత్తున వలసలు వెనుకకు వచ్చివేస్తుండడంతో ఉత్తర ప్రదేశ్ వంటి దేశాలు కార్మికుల వలసలను నిలిపి వేయడం కోసం చర్యలు తీసుకోవాలి అనుకున్నాయి. ఇది కార్మికులు, వ్యాపారం, పరిశ్రమలు, ఇతర ఆర్ధిక కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపుతాయి?

- వలసల సమస్యలు తెరపైకి రావడం మంచి అంశం. రెండు నెలల క్రితం వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. వారిని నిర్లక్ష్యం చేశారు. చాల రాష్ట్రాలలో వారిని "రెండో తరగతి కార్మికులు"గా చూస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు చాల రాష్ట్రాలు వారిని "ఉత్తమమైన కార్మికులు" అంటూ చెబుతున్నాయి. 

వలస కార్మికులను వారు వెళ్లిన రాష్ట్రాలలో ఎటువంటి దుర్భర పరిష్టితులలో ఉంచుతున్నారో ఈ మహమ్మారి వెల్లడి చేసింది. చాలా రాష్ట్రాలలో తగిన జీతాలు, సామజిక భద్రత లేకుండా వారు అమానుష పరిస్థితులలో ఉండవలసి వస్తున్నది. 

ఇప్పుడు మానసిక, సామజిక కారణాలతో, ముఖ్యంగా తమ కుటుంబాల గురించిన ఆవేదనతో కార్మికులు తిరిగి తమ గ్రామాలకు వెళ్లడం ప్రారంభించారు. తమ గ్రామాలకు, కుటుంబాల వద్దకు వెళ్లడాన్ని ఏ రాష్ట్రం కూడా వారిని అడ్డుకోలేదు. 

వర్షాకాలం వరకు, ఆదాయం సమకూర్చే  ఉద్యోగాలను వెదుక్కొంటూ పట్టణ ప్రాంతాలకు వెళ్లే వరకు వారు తమ గ్రామాలలో ఉండాలని అనుకోవచ్చు. పరిశ్రమలు ఈ వలస కార్మికులు కావలి అనుకొంటే వారు ముందస్తు నగదు, రైల్ చార్జీలతో పాటు ప్రోత్సాహకాలు ఇచ్చేటట్లు చూడాలని మేము ప్రభుత్వానికి సూచించాము. 

* వేతనాలకు సంబంధించి వలస కార్మికులకు స్థానిక కార్మికులకన్నా తక్కువగా చెల్లిస్తున్నారా?

- అవును. నైపుణ్యం, నైపుణ్యం లేని, పాక్షికంగా నైపుణ్యం గల పనులలో తీసుకొనే కార్మికులలో వలస కార్మికులు అట్టడుగు స్థాయిలో ఉన్నారు. వారిని రోజువారీ కూలీలుగా,   తాత్కాలిక కార్మికులుగా, కాంట్రాక్టు కార్మికులుగా తీసుకొంటున్నారు. వారిలో చాల కొద్ది మంది నైపుణ్యం గల కార్మికుల కిందకు వస్తారు. కేవలం స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న వలస కార్మికులు మాత్రమే సంఘంగా ఏర్పడి, మెరుగైన జీతాలు పొందుతున్నారు. 

* లాక్ డౌన్ ను సడలిస్తున్నా కార్మికులు ఎందుకని తన స్వస్థలాలకు వెళ్ళిపోవాలి అనుకొంటున్నారు?

- పరిస్థితులు మెరుగు పడతాయి. కానీ అందుకు కొంత సమయం తీసుకొంటుంది. వివిధ ఆర్ధిక రంగాలలో వివిధ స్థాయిలలో పరిస్థితులు మెరుగు పడతాయి. వలస కార్మికులకు  సంబంధించి కొంత సమయం పడుతుంది. ఎందుకంటె పట్టణ ప్రాంతాలలో ఎటువంటి భవిష్యత్ ఉన్నదో వారికి ఇంతా స్పష్టం కావడం లేదు. 

నిత్యావసర, పాక్షికంగా నిత్యావసరంగా ఉన్న రంగాలలో  పరిస్థితులు  సాధారణ పరిస్థితులకు  చేరుకోవచ్చు. కానీ పర్యటికం, ఆటోమొబైల్, విలాసవంత వస్తువులు వంటి అత్యవసర సేవలు కానీ సేవలు పునరుద్ధరించిడానికి మరికొంత సమయం పట్టవచ్చు. 

ప్రస్తుతం ఉన్న కార్మికులలో సహితం రెండు రకాల సమస్యలు ఉన్నాయి. మొదటగా, పెద్ద ఎత్తున వలస వెళ్లడంతో పరిశ్రమలకు చౌకగా కార్మికులు లభించడం లేదు. ఈ పరిస్థితి సమస్యలు కలిగించవచ్చు. మరోవంక, 15 రాష్ట్ర ప్రభుత్వాలు పని గంటలను 8 నుండి 12 గంటలకు పెంచాయి. కర్ణాటకలో అయితే 11 గంటలకు పెంచారు. 

అందుకోసం వారికి ఓవర్ టైమ్ చెల్లిస్తున్నామని చెబుతున్నప్పటికీ అది ఉద్యోగ కల్పనకు  విరుద్ధం. కార్మికులను  అదనపు గంటలు పనిచేయమని అడిగే బదులు వారు ఎక్కువ మందిని నియమించుకోవాలి. 

* చాలా రాష్ట్రాలు నూతన కార్మిక చట్టాలను తీసుకు వస్తూ ఉండడంతో కార్మికులకు సామాజిక పక్రియ సడలి పోతున్నదా? ఈ అంశాన్ని రాష్ట్రపతి వద్ద బిఎంఎస్ ప్రస్తావించింది. కార్మికుల ప్రయోజనాలు, ముఖ్యంగా అసంఘటిత రంగంలో కాపాడటం కోసం మీరు బలమైన కేంద్ర ప్రభుత్వ జోక్యం కావాలని అనుకొంటున్నారా?

- ఈ మధ్య వచ్చిన గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ - మూడు రాష్ట్రాలు తీసుకు వచ్చిన ఆర్డినెన్సులను మనం కార్మిక సంస్కరణలు అని అనలేము. మూడు లేదా నాలుగు నిబంధనలు తప్పించి ఇది మూకుమ్మడిగా అన్ని కార్మిక చట్టాలను సమాధి చేయడమే. 

ఈ మూడు రాష్ట్రాలలో కార్మికులకు సంబంధించిన మౌలికమైన సూత్రాలు లేవు. ఏ నాగరిక సమాజానికైనా చట్టబద్ధ పాలన ప్రాధమికమైనది. వివాదాలు ఏర్పడితే, కార్మికులకు న్యాయం పొందే అవకాశం లేదు. 

ఇది చైనాకు పూర్తికా భిన్నమైనది. అక్కడ గల ఒక వెబ్ సైట్ పెట్టుబడులు పెట్టాలి  అనుకున్నవారికి తప్పనిసరిగ్గా అనుసరింప దగిన కార్మిక చట్టాలను స్పష్టంగా తెలుపుతుంది. 

వాస్తవం ఏమిటంటే పెట్టుబడి పెట్టేవారు కార్మిక చట్టాల గురించి ఏమీ బాధ పడటం లేదు. అధికారులు మాత్రమే విముఖత చూపుతున్నారు. భారత దేశంలో సులభతరం వాణిజ్యానికి  సంబంధించిన అన్ని సమస్యలను  పరిష్కరించే  విధంగా  సమగ్రమైన  అధికార వ్యవస్థలో సంస్కరణలు తీసుకు రావాలని బిఎంఎస్ డిమాండ్ చేస్తుంది.