కరోనా తర్వాత భీమా వ్యాపారానికి డిమాండ్!

కరోనా తర్వాత భీమా వ్యాపారానికి మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకనే దేశంలో చాల కంపెనీలు ఉన్న ఉద్యోగులను తగ్గించుకొంటూ ఉంటె కొత్తగా ఉద్యోగుల ఎంపిక కోసం భీమా కంపెనీలు సిద్ధపడుతున్నాయి. దేశంలోని ఐదు పెద్ద భీమా కంపెనీలు కలిసి 5,000కు పైగా ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. 

పైగా, ప్రభుత్వ బ్యాంకుల విలీనం‌‌‌‌ జరగడంతో వీటికి చెందిన భీమా కంపెనీలలో కూడా మార్పులు మొదలయ్యాయి. ఈ కంపెనీల ఖాతాదారుల పరిధి  పెరిగింది. దీంతో కొత్తగా ఉద్యోగులను రిక్రూట్‌‌‌‌ చేసుకోవడానికి ఈ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. జనరల్‌‌‌‌, లైఫ్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌ ఈ రెండు సెగ్మెంట్లలో కూడా సమానమైన అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. 

పీఎన్‌‌‌‌బీ మెట్‌‌‌‌లైఫ్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌ జూన్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 1,500 మందిని రిక్రూట్‌‌‌‌ చేసుకోనుందని చెప్పారు. ఈ ఏడాదిలో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌ మూడు వేలకు చేరుతుందని అంచనావేశారు. కెనరా హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌బీసీ ఓబీసీ లైఫ్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌ కంపెనీ కూడా జూన్‌‌‌‌ చివరి నాటికి వెయ్యి మందికి పైగా రిక్రూట్‌‌‌‌ చేసుకోవాలని ప్లాన్స్‌‌‌‌ వేస్తోందని అన్నారు. ఈ కంపెనీ ప్రమోటర్లయిన కెనరా బ్యాంక్‌‌‌‌, ఓరియంటల్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కామర్స్‌‌‌‌లు(ఓబీసీ) వేరే బ్యాంకులతో మెర్జ్‌‌‌‌ అయిన విషయం తెలిసిందే.  

మరోవైపు టాటా ఏఐజీ సుమారు వెయ్యి మందిని రిక్రూట్‌‌‌‌ చేసుకోవాలని చూస్తున్నట్లు చెబుతున్నారు.  ‘టాటా ఏఐఏ లైఫ్‌‌‌‌ 50‌‌‌‌‌‌‌‌0 మందిని నియమించుకోనుంది. రిలయన్స్‌‌‌‌ నిప్పన్‌‌‌‌ మే నెలలో 300 మందికి ఉద్యోగాలిచ్చింది. మరో 400 మందిని జూన్‌‌‌‌లో రిక్రూట్‌‌‌‌ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.