47.40 శాతానికి పెరిగిన క‌రోనా రిక‌వ‌రీ రేటు

దేశంలో కరోనా పంజా విసురుతున్నా వైరస్ సోకి తగ్గుముఖం పట్టిన వారి సంఖ్య పెరుగుతుందని కేంద్రం తెలిపింది.  1,74,355 కేసులతో మనదేశం టర్కీని అధిగమించిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

జూన్-జూలై నాటికి దేశంలో ఎక్కువ కేసులు నమోదవుతాయని అంచనా వేశారు.   మరో వైపు  గత 24 గంటల్లో 11,264 మంది కరోనా తగ్గడంతో రికవరీ రేటు 4.51 శాతం పెరిగి 47.40 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసు సంఖ్య  89,987 నుండి 86,422 కు తగ్గినట్లు కేంద్రం ప్రకటించింది.

గ‌త కొన్నిరోజులుగా ప్ర‌తిరోజు ఐదు వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. వైర‌స్ బారి నుంచి కోలుకు డిశ్చార్జి అయ్యేవారు మాత్రం త‌క్కువగా ఉంటున్నారు. అయితే శ‌నివారం మాత్రం అందుకు భిన్న‌మైన అంకెలు న‌మోద‌య్యాయి. కోలుకున్న వారి సంఖ్య భారీగా పెరిగింది.   

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వ ప్రకారం 62,228 కరోనా కేసులు నమోదు 2,098 మరణాలతో మహారాష్ట్ర దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన ప్రాంతంగా గుర్తించారు.

గత వారం దేశవ్యాప్తంగా 28,34,798 కరోనా వైరస్ నమూనాలను పరీక్షించగా గత 24 గంటల్లో 115,364 నమూనాలను పరీక్షించామని భారత వైద్య పరిశోధన మండలి  తెలిపింది. ప్రస్తుతం మనదేశంలో లాక్ డౌన్ నాలుగో దశలో ఉండగా సగటున 7,000 మందికి పైగా  కరోనా టెస్ట్ లు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.