ఊహించని పరిణామాలను ధైర్యంతో ఎదుర్కొన్న మోదీ 

గత సంవత్సర కాలంలో అనేక ఊహించని పరిణామాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధైర్యంతో ఎదుర్కొన్నారని బిజెపి అధ్యక్షుడు జిపి నడ్డా కొనియాడారు. రెండో సారి ప్రధాని పదవి చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ 60 ఏళ్లుగా అభివృద్ధిలో ఉన్న అంతరాన్ని ఆరేళ్లలో ప్రధాని మోదీ పూరించారని పేర్కొన్నారు. 

అందుకు ఉదాహరణగా నడ్డాఆర్టికల్ 370 రద్దును ఉటంకిస్తూ దేశమంతా ఒకే జెండా కిందికి రావడానికి ఈ నిర్ణయం దోహదపడిందని తెలిపారు.  మోదీ ప్రభుత్వం ప్రతిస్పందించే ప్రభుత్వమని, అలాగే సలహాలను కూడా స్వీకరించడంతో పాటు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్న ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు.

రాజకీయ రంగంలో ఓ సాంస్కృతిక మార్పును మోదీ తీసుకొచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. ఏది జాతికి అవసరమో దాన్ని మాత్రమే సకారాత్మకంగా అమలు చేస్తామని, ఏదో ఒకటి చేసేద్దాం అన్న ధోరణిలో తమ ప్రభుత్వం నడుచుకోవడం లేదని తేల్చి చెప్పారు. మోదీ పాలనపై 250 ప్రెస్‌మీట్లు, దేశమంతా 2000 ర్యాలీలతో ప్రచారం చేస్తామని జేపీ నడ్డా పేర్కొన్నారు.