మోదీజీ దూరదృష్టి, నిర్ణయాత్మక నాయకత్వం

దూరదృష్టి, నిర్ణయాత్మక నాయకత్వం నేతృత్వంలో  దేశాన్ని మరింత ముందుకు నడిపిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. భారత ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి  రెండోసారి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ 60 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ పాలనలో చేసిన చారిత్రాత్మక తప్పిదాలను ఆరేళ్ల కాలంలో నరేంద్ర మోదీ సరిచేసి చూపారని కొనియాడారు. 

మోదీ గత ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఫలితమే మరోసారి అద్భుతమైన విజయాన్ని తెచ్చిపెట్టాయని అభినందించారు. 130 కోట్ల ప్రజలకు మోదీ నాయకత్వ పటిమ మీద అపారమైన నమ్మకం ఉందని, ఆయన కష్టపడే తత్వమే ఈ స్థాయికి తీసుకువచ్చిందని అమిత్‌ షా పేర్కొన్నారు. సమర్థవంతమైన నాయకత్వంతో ప్రపంచ దేశాల వేదికపై భారత్‌ను గర్వపడేలా చేశారని తెలిపారు.  

అలాగే దేశ వ్యాప్తంగా బీజేపీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు అమిత్ షా  కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పథకాలను, విజయాలను ప్రతి గడపకు చేరవేసిన కోట్లాది కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు శనివారం ట్విటర్‌ వేదికగా అమిత్‌ షా వరుస ట్వీట్లు చేశారు.