డ‌బ్ల్యూహెచ్‌వో అమెరికా తెగగతెంపులు  

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌తో సంబంధాల‌ను తెంచుకుంటున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.  క‌రోనా వైర‌స్‌ను నియంత్రించ‌డంలో డ‌బ్ల్యూహెచ్‌వో విఫ‌ల‌మైన‌ట్లు ట్రంప్ ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. 

నెల‌ రోజుల క్రితం డ‌బ్ల్యూహెచ్‌వోకు నిధుల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ఆయ‌న వెల్లడించాయిరు. చైనాకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తోలుబొమ్మ‌లాగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ట్రంప్ ఆరోపించారు. డ‌బ్ల్యూహెచ్‌వోలో స‌మూల మార్పులు జ‌ర‌గ‌కుంటే, శాశ్వ‌తంగా ఆ సంస్థ‌కు నిధుల‌ను నిలిపివేయ‌నున్న‌ట్లు ట్రంప్ స్పష్టం చేశారు. 

ఎన్ని విజ్ఞ‌ప్తులు చేసినా, కావాల్సిన సంస్క‌ర‌ణ‌ల‌ను డ‌బ్ల్యూహెచ్‌వో చేప‌ట్ట‌లేద‌ని ట్రంప్ విమ‌ర్శించారు. అందుకే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌తో రిలేష‌న్‌షిప్‌ను వ‌దులుకుంటున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. 

డ‌బ్ల్యూహెచ్‌వోకు బ‌దులుగా, ప్ర‌పంచ వ్యాప్తంగా ఆరోగ్య‌ప‌రంగా అత్య‌వ‌స‌ర‌మైన దేశాల‌కు ఆ నిధుల‌ను మ‌ళ్లించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  క‌రోనా వైర‌స్ ప‌ట్ల చైనా నుంచి స‌మాధానం కావాల‌ని ప్ర‌పంచ‌దేశాలు ఆశిస్తున్నాయ‌ని, ఈ విష‌యంలో పార‌ద‌ర్శ‌క‌త అవ‌స‌ర‌మ‌ని ట్రంప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.