కెసిఆర్ మరో భారీ పధకం “కంటి వెలుగు”

రానున్న ఎన్నికలలో గ్రామీణ ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఇప్పటికే రైతు పధకాన్ని అమలు చేయడం ప్రారంభించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూడు ప్రత్యేక పధకాలకు శ్రీకారం చుట్టుతున్నారు. మొదటిది రైతు భీమా పధకం కాగా, బిసిలకు రుణాలు అందజేయం రెండోవాడి. వీటితో పాటు కంటి చూపు లోపంతో బాధపడుతున్న పదాలు అందరికి వారికి కంటి పరీక్షలు చేసి, కండ్లద్దాలు, చికిత్ప అందించేందుకు “కంటి వెలుగు” కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేబడుతున్నారు.

ఐదు నెలలపాటు ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని పంద్రాగస్టున కేసిర్ స్వయంగా మెదక్ జిల్లా మల్కాపూర్‌లో ప్రారంభింస్తారు. గవర్నర్ నరసింహన్ మహబూబ్‌నగర్ జిల్లా మరికల్‌లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామా ల్లో వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

తెలంగాణలోని 12,751 గ్రామ పంచాయితీల వారిగా చేపట్టనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడానికి మొత్తం 812 వైద్య బృందాలను ఏర్పాటు చేసారు. కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా నిర్వహించే కంటి పరీక్షలు, కంటి అద్దాలు, అవసరమైన వారికి జరిపే కంటి శస్త్ర చికిత్సలు, మందులు తదితరాలు ప్రభుత్వ ఖర్చుతో పూర్తి ఉచితంగా అందజేయనున్నట్టు సీఎం కెసిఆర్ తెలిపారు. కంటిని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కంటి ఆరోగ్యానికి సంబంధించిన అవగాహనను కూడా కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ సందర్భంగా కల్పించనున్నారు.

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిధిగా తీసుకుని గ్రామాల్లో, వార్డును పరిధిగా తీసుకుని పట్టణాల్లో, కంటి వెలుగు క్యాంపులను నిర్వహిస్తున్నారు. ఒక్కో క్యాంపులోని వైద్య బృందం ప్ర‌తి రోజు గ్రామీణ ప్రాంతాల్లో 250 మందికి, పట్టణ ప్రాంతాల్లో 300 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీ తయారుచేసిన నాణ్యమైన కంటి అద్దాలను అందుబాటులోకి తెచ్చామని సియం తెలిపారు.