భారత్ లో భారత్ మాతకు చోటు లేదా!

తమిళనాడులో మైనారిటీల సంతుస్టీకరణలో పోలీసులు రాజకీయ నాయకులను అధిగమిస్తున్నారు. కన్యాకుమారి జిల్లా పులియూర్ గ్రామంలో భారత్ మాత విగ్రహం ఉండడంతో మైనారిటీల మనోభావాలకు దెబ్బ తీస్తున్నదని దానికి ముసుగు కప్పారు.

ఆ గ్రామంలోని ఇస్సాకి అమ్మన్ దేవాలయం 200 సంవత్సరాలుగా ఉంటున్నది. దాని ఆవరణలోని ప్రైవేట్ భూమిలో ఈ మధ్య  భారత మాత విగ్రహం ఏర్పాటు చేశారు. గ్రామస్థులు అందరు అమ్మవారితో పాటు ఈ విగ్రహం వద్ద కూడా పూజలు చేస్తున్నారు. 

ఇంతలో ఏమైందో ఏమిటో అకస్మాత్తుగా ఆ విగ్రహంపై ముసుగు కప్పమని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ భాస్కరం తన అధికారులను ఆదేశించారు. దానితో ఆ విగ్రహాన్ని వెంటనే తొలగిస్తారా లేదా చర్య తీసుకోమంటారా అని స్థానిక ఎస్ ఐ హెచ్చరించాడు.

ఆ విగ్రహంపై పూజ చేయవద్దని డిఎస్పీ వారికి చెప్పారు. మే 21న పోలీసులు ఆ విగ్రహాన్ని నీలం రంగు వస్త్రంతో ముసుగు వేశారు. ఆ విగ్రహం తమ మతపర మనోభావాలను గాయపరుస్తున్నదని స్థానికంగా గల క్రైస్తవ మిషనరీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ దుశ్చర్యకు పోలీసులు పాల్పడ్డారు. 

ఈ విషయం తెలియగానే బిజెపి, ఆర్ ఎస్ ఎస్, హిందూ మున్నని నేతలు ఆ మరుసటి రోజున అక్కడ సమావేశమై ఆ ముసుగును తొలగించారు. భారత మాత విగ్రహానికి పూలదండ వేసి, పూజించారు. గ్రామ పరిపాలన అధికారి నుండి గాని, మరెవ్వరి నుండి గాని ఎటువంటి ఫిర్యాదు లేకుండా ఒక కాథలిక్ బృందం ప్రోద్బలంతో స్థానిక పోలీసులు ఈ విధంగా చేశారని హిందూ మున్నని జిల్లా నేత మిసా సోమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తర్వాత జిల్లాలో 13 చోట్ల నిరసన ప్రదర్శనలు చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేసి, మళ్ళి ముసుగు వేశారు. ఆ స్థలంకు సంబంధించి తన పేరుతొ పట్టా ఉంటె శాంతి, భద్రతలకు ఎటువంటి ఆటంకం ఏర్పడక పోయినా, ఎటువంటి మతపర వివాదాలకు దారితీయక పోయినా పోలీసులు ఎందుకు ముసుగు వేశారని ఆ దేవాలయం అధినేత ట్ ముత్తుకుమార్ ప్రశ్నించారు.

 భారత మాతను అవమాన పరచిన డిఎస్పీ పై జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేస్తున్నట్లు హిందూ మున్నని నేతలు తెలిపారు. తమిళనాడులో ఒక పద్ధతి ప్రకారం హిందూ దేవతలు, ఆచారాలను అవహేళన అచేయడం, మీడియా  సినిమాల ద్వారా నాయకులూ, సినీ నటులు అవమాన పరుస్తున్నారు. 

అయినా అపోలీసులు వారిపై ఫిర్యాదులు చేస్తున్నా ఎఫ్ ఐ ఆర్ లను దాఖలు చేయడం లేదు. కానీ మైనారిటీ వారెవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే హిందూ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ఈ మధ్య ఒక కార్టూనిస్ట్ ను అరెస్ట్ చేసిన పోలీసులు దళితులపై అవమానకర వాఖ్యలు చేసిన వారిని మాత్రం పట్టించుకోలేదు. . 

తమిళ నాడులో సంఘ్, బిజెపి నేతల భావప్రకటనా స్వాతంత్రంను కట్టడి చేసే విధంగా అప్రకటిత అత్యవసర పరిస్థితి అమలులో  ఉన్నదని హిందూ మున్నని నేత, న్యాయవాది కె కుత్రలనాథన్ విమర్శించారు.

కరోనా మహమ్మారి సమయంలో ముస్లింలు, క్రైస్తవులు తమ మతపర సమావేశాలను సాంఘిక దూరాన్ని ధిక్కరించి కొనసాగిస్తున్నా హిందూ దేవాలయాలలో పూజలు చేసుకోనీయడం లేదని ధ్వజమెత్తారు. 

పోలీస్ వర్గాల కధనం మేరకు కరోనా వ్యాప్తికి తబ్లీఘి జమీత్ కారణమని అంటూ వాఖ్యలు చేసిన, సందేశాలు పంపిన 1,500 మందిపై ఎఫ్ ఐ ఆర్ లను దాఖలు చేశారు. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత వారిపై చర్య తీసుకోవాలని నిర్ణయించారు. 

వారిలో అత్యధికులు సోషల్ మీడియాలో క్రియాశీలంగా ఉన్న సంఘ్ కు చెందిన వారే. కానీ బిజెపి, ఇతర హిందూ నేతల ప్రధాని, కేంద్ర హోమ్ మంత్రిలను  బెదిరిస్తూ  మాట్లాడిన ముస్లిం నేతలపై ఫిర్యాదు లు చేసినా పట్టించుకోవడం లేదు.