జీహెచ్‌‌ఎంసీకి సవాల్‌‌గా  కరోనా కాంటాక్ట్ లు

కరోనా కేసుల కాంటాక్ట్​లను పట్టుకోవడం జీహెచ్‌‌ఎంసీకి సవాల్‌‌గా మారింది. తెలంగాణ మొత్తం కరోనాను దాదాపు కట్టడి చేయగలిగిన, హైదరాబాద్ నగరంలో మాత్రం రోజురోజుకూ పెరుగుతున్న  కేసులతో  ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కంటెయిన్‌‌మెంట్‌‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నా వ్యక్తులకు వైరస్‌‌ ఎలా వచ్చిందో తెలుసుకోలేక పోతున్నారు. 

ప్రయాణ చరిత్ర నుండి నుంచి ప్రైమరీ కాంటాక్ట్‌‌ల వివరాలు సేకరిస్తున్నా ఉపయోగం ఉండడం లేదు. ప్రయాణ చరిత్ర లేకుండానే పలు పాజిటివ్‌‌ కేసులు వచ్చిన ఏరియాలో బల్దియా అధికారులు భిన్నంగా అధ్యయనం  చేయవలసి వస్తున్నది.  ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌‌ల కోసం అన్వేషిస్తున్నారు. 

మూసాపేటలో ఓ డాక్టర్‌‌కు వైరస్‌‌ సోకింది. లాక్‌‌డౌన్‌‌ మొదలైనప్పటి నుండి ఆయన హాస్పిటల్‌‌కు వెళ్లలేదు. ప్రయాణ చరిత్ర లేదు.  వైరస్‌‌ ఎలా సోకిందనేది అంతుచిక్కడం లేదు. ప్రతి పాజిటివ్‌‌ కేసులోనూ కాంటాక్ట్‌‌ చైన్​ ఎక్కువగా ఉండడం అధికారులకు తలనొప్పిగా మారింది. 

ఇంతకుముందు కరోనా వస్తే ఆ వ్యక్తి ఇల్లు ఉన్న గల్లీ మొత్తం కంటెయిన్‌‌ మెంట్‌‌ జోన్‌‌ చేసేవారు. నిర్వహణ ఇబ్బందులతో ప్రస్తుతం పాజిటివ్‌‌ వ్యక్తుల కుటుంబాన్నే హోమ్‌‌ క్వారంటైన్‌‌ చేస్తున్నారు. కాంటాక్ట్‌‌ల ట్రేసింగ్‌‌పైనే ఎక్కువ ఫోకస్‌‌ పెడుతున్నారు. కానీ పాజిటివ్‌‌ వచ్చిన కొందరు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌‌ల వివరాలు చెప్పకపోవడం వల్ల వైరస్‌‌ వ్యాప్తి తీవ్రమవుతున్నది.