14-29 లక్షల కరోనా కేసులను అడ్డుకున్నాం

భార‌త్ లో స‌రైన స‌మ‌యంలో లాక్ డౌన్ అమ‌లు చేయ‌డంతో క‌రోనా వైర‌స్ వ్యాప్తిని స‌మ‌ర్థంగా క‌ట్ట‌డి చేయ‌గ‌లిగామ‌ని సెంట్ర‌ల్ క‌రోనా టాస్క్ ఫోర్స్ ఎంప‌వ‌ర్డ్ గ్రూప్ 1 చైర్మ‌న్ వీకే పాల్ తెలిపారు. వైర‌స్ వ్యాప్తి వేగాన్ని కట్టడి  చేయ‌డంతో పాటు కొత్త ప్రాంతాల‌కు విస్తరింపకుండా  ఆప‌డంలో విజయం సాధించినట్లు పేర్కొన్నారు. 

లాక్‌డౌన్‌కు ముందు 3.4 రోజుల్లో కేసులు రెట్టింపుకాగా ప్రస్తుతం 13.3 రోజులు పడుతున్నదని తెలిపారు. పటిష్టమైన చర్యల కారణంగా 14 నుండి 29 లక్షల కేసులు నమోదు కాకుండా కాపాడగలిగామని, 37 నుంచి 78 వేల మరణాలను అడ్డుకోగలిగామని వివరించారు. 

 దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన 1,18, 447 క‌రోనా కేసుల్లో ఎక్కువ భాగం కొన్ని రాష్ట్రాల్లోనే ఉన్నాయ‌ ని, కొన్ని ప్రాంతాల్లో క‌రోనా తీవ్ర‌త చాలా త‌క్కువ‌గానే ఉంద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం దేశంలో మొత్తం 66,330 యాక్టివ్ కేసులు ఉండ‌గా, అందులో 70 శాతం కేవ‌లం ప‌ది నగరాలలోని ఉన్నాయని వెల్లడించారు. 

ఇక ప‌ది రాష్ట్రాల‌ను క‌లిపి లెక్క‌గ‌డితే దేశంలోని 90 శాతం యాక్టివ్ కేసులు తేలాయని, మిగ‌తా దేశ‌మంతా క‌లిపి 10 శాతం కేసులు ఉన్నాయ‌ని చెప్పారు.  దేశంలో ఉన్న మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల్లో 80 శాతం మ‌హారాష్ట్ర, గుజ‌రాత్, త‌మిళ‌నాడు, ఢిల్లీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ల‌లోనే ఉన్నాయ‌ని తెలిపారు. 

ఇక క‌రోనాతో సంభ‌వించిన మ‌ర‌ణాలు కూడా కొన్ని ప‌రిమిత రాష్ట్రాలు, నగరాలల్లోనే ఎక్కువ‌గా న‌మోదైన‌ట్లు వీకే పాల్ తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా 10 రాష్ట్రాల్లో క‌లిపి 95 శాతం, ప‌ది నగరాలల్లో క‌లిసి 70 శాతం మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ట్లు వివరించారు. 

70 శాతం యాక్టీవ్   కేసులున్న పది నగరాలు: ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మ‌దాబాద్, థానే, పూణే, ఇండోర్, కోల్ క‌తా, హైద‌రాబాద్, ఔరంగాబాద్. 60 శాతం యాక్టీవ్ కేసులున్న 5 నగరాలు:  ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మ‌దాబాద్, థానే.

90 శాతం కేసులున్న 10 రాష్ట్రాలు: మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, గుజ‌రాత్, ఢిల్లీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ప‌శ్చిమ బెంగాల్, బిహార్, క‌ర్ణాట‌క‌.

80 శాతం మరణాలున్న 5 రాష్ట్రాలు: మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్, మ‌ధ్య‌ప్ర‌దేశ్, ప‌శ్చిమ బెంగాల్, ఢిల్లీ. 95 శాతం మరణాలున్న 10 రాష్ట్రాలు: మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్, మ‌ధ్య‌ప్ర‌దేశ్, ప‌శ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజ‌స్థాన్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌పదేశ్, క‌ర్ణాట‌క‌.

60 శాతం మరణాలున్న 5 నగరాలు: ముంబై, అహ్మ‌దాబాద్, పుణే, ఢిల్లీ, కోల్ క‌తా. 70 శాతం మరణాలున్న 10 నగరాలు: ముంబై, అహ్మ‌దాబాద్, పుణే, ఢిల్లీ, కోల్ క‌తా, ఇండోర్, థానే, జైపూర్, చెన్నై, సూర‌త్.

శుక్రవారం నాటికి 48,534 మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. మరణాల రేటు 3.13 నుంచి 3.02కు తగ్గిందని పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు 27,55,714 కరోనా పరీక్షలను నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ అధికారి తెలిపారు. గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ లక్షకుపైగా పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు.