అంఫాన్ తుపాన్ విలయంలో ఆర్ ఎస్ ఎస్ సేవ 

జోయదీప్ మొయిత్రా  

ఆర్ ఎస్ ఎస్ ఒక తీవ్రవాద సంస్థ అని, జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తోందని లౌకిక, ఉదారవాద, అంతర్జాతీయ మీడియా తరచూ దాడి చేస్తుంటుంది. అయితే నిస్వార్ధ సేవ అందించడంలో ఎప్పటి వలెనె మరోసారి ముందుకొచ్చింది. 

పశ్చిమ బెంగాల్ ను 129 సంవత్సరాలలో అతి తీవ్రమైన అంఫాన్ తుఫాన్ తాకిన సమయంలో ఆ రాష్ట్రంలోని కోస్తా ప్రాంతంలో ఉన్న దక్షిణ-ఉత్తర 24 పరాగణాలతో పాటు కొలకత్తా, పూరబ్ మెడినిపూర్ నగరాలలో స్వయంసేవకులు ముందుండి తక్షణమే సేవా కార్యక్రమాలు చేపట్టారు. 

ఒక పక్కన 190 కిమీ వేగంతో గాలులు, భారీ వర్షం కురుస్తూ దిగ తీరాన్ని బుధవారం మధ్యాన్నం 2.30 గంటలకు తాకింది. అది భారీ విధ్వసం సృష్టించింది. రాష్ట్రంలో 80 మంది చనిపోయారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. వంతెనలు కొట్టుకు పోయాయి. విద్యుత్, టెలికాం సేవలకు అంతరాయం కలిగింది. 

ఒక పక్కన కరోనా మహమ్మారితో అతలాకుతలమైన రాష్ట్రంలో ఈ తుఫాన్ అల్లకల్లోలం సృష్టించింది. ఇటువంటి పరిస్థితులలో  స్వయం సేవక్ లు తుఫాన్ ప్రభావానికి గురైన ప్రతి ప్రాంతంలో వెంటనే ప్రత్యక్షమై సేవా కార్యక్రమాలలో తలమునకలై పోయారు. 

రోడ్డులపై అడ్డంగా పడిన చెట్లు, స్తంభాలు, వైర్లను తొలగిస్తూ అత్యవసర సరఫరాలు నిరాటంకంగా సాగేందుకు దోహదపడుతున్నారు. నీట మునిగిన ప్రజలను ఒడ్డుకు చేర్చడం, ఆపదలో ఉన్నవారికి సహకారం అందించడం వంటి పనులకు హాజరవుతున్నారు. 

(భారత టుడే వెబ్ సైట్ నుండి)