విరాట్ కోహ్లి, రవిశాస్త్రిలకు గడ్డుకాలమే

 

 

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా అత్యంత దారుణమైన ప్రదర్శనపై బీసీసీఐ ఆగ్రహంగా ఉండడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలకు గడ్డుకాలం గానే కనిపిస్తున్నది. మూడో టెస్ట్ ఫలితం చూసిన తర్వాత ఈ ఇద్దరిని నిలదీయడం కోసం బీసీసీఐ సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటివరకు టీమ్ ఎంపిక, టూర్ షెడ్యూల్, సపోర్టింగ్ స్టాఫ్‌ల విషయంలో ఈ ఇద్దరూ ఏది చెబితే అది అన్నట్లుగా సాగింది.  మరో విదేశీ సిరీస్‌లో దారుణమైన పరాజయాలు కోహ్లి, శాస్త్రిల అధికారాలకు కత్తెర వేయవేయక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి.

. మూడో టెస్ట్‌లో కూడా ఓడి సిరీస్ కోల్పోతే కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలను వీళ్లకు సంధించడానికి బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాతి రెండు టెస్ట్ లకు పలు మార్పులు చేయక తప్పదని భావిస్తున్నారు. ఈసారి తమకు తగినంత సమయం ఇవ్వలేదని టీమ్ ఫిర్యాదు చేసేందుకు వీల్లేదు. సౌతాఫ్రికాలో సిరీస్ ఓడిపోయినపుడు షెడ్యూల్‌పై ప్లేయర్స్ మండిపడ్డారు. దీంతో ఈసారి వాళ్లతో మాట్లాడిన తర్వాతే ఇంగ్లండ్ టూర్‌లో పరిమిత ఓవర్ల సిరీస్ తర్వాత టెస్ట్ సిరీస్ షెడ్యూల్  చేయడం గమనార్హం.

ఈ వరుస ఓటముల తర్వాత అసలు కోహ్లి, శాస్త్రిలకు అన్ని అధికారులు ఎందుకు ఇచ్చారన్న ప్రశ్న బీసీసీఐ వర్గాల్లో తలెత్తుతున్నది. "సీనియర్ టీమ చెప్పినందుకే అదే సమయంలో ఇండియా ఎ టీమ్‌ను ఇంగ్లండ్‌కు పంపించాం. అందులో ఇద్దరు సీనియర్లు విజయ్, రహానే కూడా ఉన్నారు. వాళ్లు అడిగనవన్నీ ఇచ్చాం. ఇప్పుడు అందుకు తగినట్లు ఫలితాలు రాకపోతే వాళ్లు కొన్ని ప్రశ్నలను ఎదుర్కోవాల్సిందే" అంటూ  బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికే రవిశాస్త్రి, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ నేతృత్వంలో ఇండియా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లలో ఓడిందని, ఇప్పుడు ఇంగ్లండ్‌లోనూ అదే పరిస్థితి ఎదుర్కొంటున్నదని ఆయన చెప్పారు.

గతంలో ఇంగ్లండ్‌లో సిరీస్ ఓడిపోయినపుడు అప్పటి కోచ్ డంకన్ ఫ్లెచర్‌ను బోర్డు తీసేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.రెండు మ్యాచ్ లలో భారత్ ను సునాయనంగా ఓడించడంతో మిగిలిన మూడు మ్యాచ్ లలో కూడా తేలికగా ఓడిస్తామని ధీమా ఇంగ్లాండ్ జట్టులో కనిపిస్తున్నది. ఇప్పుడు రవిశాస్త్రికే అదే జరగబోతుందా అన్న అనుమానాలు చెలరేగుతున్నాయి.

కాగా, లార్డ్స్‌ మైదానంలో తమ బ్యాటింగ్‌ వైఫల్యానికి సాంకేతిక అంశాలుకన్నా మానసిక సమస్యలే అసలైన కారణాలని విరాట్‌ కోహ్లీ పేర్కొనడం గమనార్హం. సహచరులు ఆటను ఒత్తిడితో కాకుండా సింపుల్‌గా తీసుకోవాలని సూచించాడు.