పివోకేలోని ఉగ్రవాదులతో కరోనా వ్యాప్తి

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలలో ఉన్న వారిలో కరోనా వ్యాపించిందని, దీని కారణంగా కొందరు చనిపోయారు కూడా అని జమ్ముకాశ్మీర్‌ డిజిపి దిల్‌బాగ్‌ సింగ్‌ చెప్పారు. ఈ కరోనా లక్షణలు కల్గిన ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించి కరోనా వ్యాప్తి చేయాలని చూస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

కశ్మీర్‌ నుంచి ఉగ్రవాద శిక్షణ కోసం పివోకే వెళ్లిన ఒక వ్యక్తి తన ఇంటికి చేసిన ఫోన్‌ను తాము టాప్‌ చేశామని, అందులో ఈ విషయాలు బయటపడ్డాయని దిల్‌బాగ్‌ సింగ్‌ వెల్లడించాయరు. ఉగ్రవాదులు కరోనా బారిన పడి చనిపోతున్నప్పటికీ పట్టించుకున్న నాధుడు ఎవ్వరూ లేరని ఆ ఫోన్‌ చేసిన వ్యక్తి ఆందోళన వ్యక్తం చేసినట్లు దిల్‌బాగ్‌ సింగ్‌ తెలిపారు. 

పాకిస్తాన్‌ 20 ఉగ్రవాద కేంద్రాలను, 20 టెర్రరిస్టు ల్యాంచ్‌ ప్యాడ్‌లను ప్రస్తుతం పివోకేలో సిద్దంగా ఉంచిందని, ఒక్కొ కేంద్రంలో 50 మంది వరకు ఉగ్రవాదులు ఉన్నారని దిల్‌బాగ్‌ సింగ్‌ చెప్పారు.