బెంగాల్ లో ప్రధాని శుక్రవారం పర్యటన 

ఉంపన్‌ తుపాను బీభత్సంతో దెబ్బతిన్న పశ్చిమ బెంగాల్ లో తుపాన్‌ విధ్వంసాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం బెంగాల్‌లో పర్యటిస్తారు. బెంగాల్‌, ఒడిషా రాష్ట్రాల్లో తుపాను నష్టాన్ని ఏరియల్‌ సర్వేలో పర్యవేక్షిస్తారు. 

కాగా తుపాన్‌ ప్రభావిత బెంగాల్‌ను సందర్శించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంతకుముందు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. దాదాపు లక్ష కోట్ల రూపాయల నష్టం జరిగిందని తెలిపారు. తుపాన్‌ ధాటికి పశ్చిమబెంగాల్‌లో 72 మంది మరణించిన సంగతి తెలిసిందే. 

పెను తుపాన్‌పై ప్రధాని స్పందిస్తూ దేశమంతా పశ్చిమబెంగాల్‌కు అండగా నిలుస్తుందని ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. ఉంపన్‌తో నష్టపోయిన బాధితులకు సహాయం అందించడంలో ఏ విధంగానూ వెనుకాడమని స్పష్టం చేశారు.