జలవివాదాలపై అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి రంగం సిద్ధమైంది. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో వివాదాలను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చర్చింది, ఈ సమావేశంలో ఒక పరిష్కారానైకి ప్రయత్నిస్తారు. 

త్వరలోనే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర జల్‌ శక్తి శాఖ వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు, కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు సమాచారం అందించారు. సమావేశం అజెండా కోసం అంశాలు పంపాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. 

పోతిరెడ్డిపాడు వివాదం నేపథ్యంలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.  ఏపీలోని పోతిరెడ్డిపాడును విస్తరిస్తూ ప్రభుత్వం 203 జీవో జారీ చేసింది. ఈ జీవోను తెలంగాణ ప్రభుత్వం తప్పుబట్టింది. కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. 

అటు తెలంగాణలోని ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్ కూడా అభ్యంతరంవ్యక్తం చేశారు. దీంతో కృష్ణా రివర్ బోర్డు యాజమాన్యం ఇరు రాష్ట్రాలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. 

గత  ఆరేళ్లలో ఒకే ఒక్కసారి అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ జరిగింది. 2015లో కేసీఆర్‌, చంద్రబాబు, నాటి కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది.