ప్రపంచం ముందు భారత్ సేవా నమూనా 

నేడు మొత్తం ప్రపంచం ఈ శతాబ్దంలోనే ఎరుగని విపత్తును ఎదుర్కొంటున్నది. ఈ విషాదానికి మానవాళి జీవనం అతలాకుతలమవుతోంది. ఈ కరోనా మహమ్మారిని తట్టుకోవడం ఆర్ధికంగా సంపన్నమైన దేశాలకే సాధ్యం కావడం లేదు. అటువంటప్పుడు భారత ప్రభుత్వం స్థిరంగా ఈ సమస్యను ఎదుర్కోవడమే కాకుండా, భారతీయ సమాజం సహితం మొత్తం ప్రపంచం ముందు మానవ సేవా నమూనాను ప్రదర్శిస్తున్నది. 

భారత ప్రభుత్వం కరోనా కట్టడి పట్ల వ్యవహరిస్తున్న తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. అనేక దేశాలకు అత్యవసరమైన మందులను కూడా భారత్ సరఫరా చేస్తున్నది. దేశం లోపల కూడా వ్యక్తులు, సమూహాలు కరోనా బాధితులకు అసమాన్యమైన సేవలు అందిస్తున్నారు. అవసరాల మేరకు లెక్కలేనంతమంది ఆపన్నులను ఆదుకొంటున్నారు. 

కొందరు వ్యక్తులుగా మిత్రులతో కలసి, కొందరు తమ ప్రాంతపు బ్యానర్ పై, మరో కొందరు తమ సంస్థలు లేదా సేవా సంస్థలతో ఏదో ఒకరూపంలో ఆపదలో ఉన్నవారిని   ఆదుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మాస్క్ లు అందించడం నుండి భోజనం, మందులు అందించడం వరకు చేస్తున్నారు. రక్త దానంకు కూడా ముందుకు వస్తున్నారు. సమాజంలో ప్రతి వర్గానికి చెందిన పౌరులు తమ సామర్ధ్యం మేరకు సహకారం అందిస్తున్నారు. 

పాశ్చాత్య సమాజం చాలా కాలంగా పలు దురభిప్రాయాలతో భారత సమాజాన్ని చూస్తున్నది. వారే కాకూండా మన దేశంలో ఉన్న పలువురికి కూడా విభిన్నంగా కనిపించే భారతీయ సమాజంలో నిబిడీకృతమై ఉన్న శక్తీ గురించి తెలియదు. వారి దృష్టిలో మన సమాజం అనేక వర్గాలుగా విడిపోయి ఉంది. అటువంటి పరిస్థితులు నెలకొన్న మన సమాజం కరోనా వంటి మహమ్మారిని తట్టుకొని నిలబడటం అసాధ్యం అని భావించారు. 

కానీ ప్రస్తుత సంక్లిష్ట పరిష్టితులలో భారత సమాజం ఉమ్మడిగా ఈ సంక్షోభం నుండి బైటపడే ప్రయత్నం చేయడం మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. కొన్ని విస్తృతమైన సంస్థలు మినహా చాల సంస్థలను స్థానికంగా ఉన్న సాధారణ సేవకులు స్వయంగా ఏర్పాటు చేసుకున్నవే. వారెవ్వరికి జీతాలపై పూర్తి సమయం పనిచేసే వారు లేరు. చాలావరకు బృందాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

అయినా, వారు ఎంతో అంకిత భావంతో క్రియాశీలకంగా, సాధికారికంగా పనిచేయగలగడంను సామజిక శాస్త్రవేత్తలెవరైనా పరిశోధన జరపవలసిన అంశం. ప్రస్తుత సంక్షోభకర పరిస్థితులలో ఇటువంటి వేలాది బృందాలు కేవలం మానవ సేవకోసమే పనిచేస్తున్నాయి. మరెటువంటి ప్రతిఫలం ఆశించడం లేదు. వారెవ్వరికి కుల, మతాల పట్టింపు లేదు. తమకు అవసరమైన ఆర్ధిక వనరులను సహితం స్థానికంగానే సమకూర్చుకొంటున్నారు. 

ఇది పూర్తిగా సమాజం, సమాజం కోసం సమాజ పరంగా  సమకూర్చుకొంటున్న భారతీయ సేవా నమూనా అని చెప్పవచ్చు. పైగా, ఈ సేవా కార్యక్రమాలలో వారంగా స్వయం ప్రేరణతో, మరెవ్వరిపై ఆధారపడకుండా, సామజిక లక్ష్యం సాధించడంలో విజయవంతంగా  స్వావలంబనతో    పనిచేస్తున్నారు. 

సంఘ్ కార్యకర్తలు చేసే పనులను, ముఖ్యంగా విపత్తు సమయాలలో ప్రత్యర్ధులు కూడా ప్రశంసిస్తుంటారు. 2001లో గుజరాత్ లో సంభవించిన భూకంపమైనా, లేదా 2014లో కాశ్మీర్ లోని వరదలైనా, మరే సంక్షోభమైనా స్వయంసేవకులు బాధ్యతలు చేపడితే పూర్తి శక్తితో విపత్తులను అధిగమిస్తారనే విశ్వాసం నేడు సమాజంలో నెలకొంది. 

స్వయం సేవకుల బృందాలు తమ గురించి పట్టించుకోకుండా తమ చుట్టూ ఉన్న  బాధితుల కోసం తరచూ పనిచేయడం కనిపిస్తున్నది. సేవ భారతి, ముస్లిం రాష్ట్రీయ మంచ్ లేదా మరో పేరుతోనో వికనిపిస్తుంది. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో మొత్తం ప్రజానీకం ఇళ్లలోనే ఉండిపోవలసి వచ్చినా, ఈ సంస్థలకు చెందిన కార్యకర్తలు తమ జీవితాల గురించి పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలసి కరొనపై బృహత్తర అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం మారుమూల ఉన్న అరుణాచల్ ప్రదేశ్ నుండి దక్షిణాది లోని కేరళ వరకు జరుగుతున్నది. 

రాజస్థాన్ లోని పెద్ద ఆసుపత్రులలో మాస్క్ ల కొరత ఏర్పడితే రాత్రికి రాత్రి ఈ సంస్థలు 5,000 మాస్క్ లు తయారు చేసి అందించారు.  లక్నో లో విద్యాభారతి ఏర్పాటు చేసిన ఇసోలేషన్  శిబిరాలలో చాలామంది కార్యకర్తలు పారిశుధ్యం, శానిటైజెషన్ పనులు కూడా చేశారు. మాతా  శక్తి, దుర్గా వాహిని వంటి సంస్థలు మహిళా కార్యకర్తలతో కలసి మాస్క్ లను తయారు చేశారు. 

భారతీయ శిక్షణ మండల్ వంటి సంస్థలు కరోనా గురించి అవగాహన  కలిగిస్తుంటే, మరో కొన్ని సంస్థలో కరోనా యోధులను  సత్కరిస్తున్నాయి. ఈ సంస్థలు ఒకొక్కటిగా చేస్తున్న చిన్న చిన్న ప్రయత్నాలు మహత్తర లక్ష్యం నెరవేర్చేందుకు దోహదపడుతున్నాయి. వారి కృషిని విస్మరింపలేము. 

కరోనా మహమ్మారి ప్రారంభంలో దీనికి భారత్ ఏ విధంగా తట్టుకొంటుందో అంటూ మొత్తం ప్రపంచం భయపడింది. భారత్ అనగానే పేదరికం, అధిక జనాభా, తగిన వనరులు లేకపోవడం అనే అభిప్రాయం కలిగిస్తూ ఉండడంతో ఈ విషాదాన్ని భారత్ ఎదుర్కోలేదని అభిప్రాయం కలిగింది. కానీ పలు సామాజిక  సంస్థల  సామూహిక  ప్రయత్నాలు ప్రపంచానికి దిగ్బ్రాంతి కలిగించాయి. 

ఇదే సమయంలో అమెరికాకు చెందిన నోబెల్ బహుమతి పొందిన జోసెఫ్ స్టెయిగ్లిట్జ్ కరోనా మహమ్మారిని ఒక మూడో దేశం వలే అమెరికా ఎదుర్కొంటున్నదని ప్రకటించి దిగ్బ్రాంతి కలిగించారు. కోట్లాది మంది అమెరికా ప్రజలు ఆహరం లేక అలమటించారు. సమర్ధవంతమైన కుటుంభం విధానం లేకపోవడంతో ఈ విషాద సమయంలో అమెరికా ప్రజలు రెండు విధాలుగా నష్టపోయారు. భారతీయ సామజిక వ్యవస్థే ఇప్పుడు మనలను కాపాడుతున్నది. 

పైగా, భారత దేశంలో 20 లక్షలకు పైగా ఎన్జీఓలు కూడా తమ తమ స్థాయిలలో సేవా కార్యక్రమాలు జరిపాయి. ఒక అంచనా ప్రకారం దేశంలో ప్రతి 600 మంది ప్రజలకు ఒక ఎన్జీఓ ఉంది.  వారికి సామజిక రంగంలో పనిచేసే నైపుణ్యం గల ఉద్యోగులు ఉండడమే కాకుండా, ఆ విధంగా చేసేందుకు విదేశీ సంస్థల నుండి గ్రాంట్ లు కూడా పొందుతున్నాయి. 

కానీ అటువంటి సంస్థలు ప్రస్తుత పరిస్థితులలో తమ అనుభవం, వనరులను బట్టి సమర్ధవంతంగా పనిచేయలేక  పోతున్నాయి.  నిధులతో పనిచేసే ఇటువంటి ఎన్జీవోలకు పూర్తి విషయం పరిజ్ఞానం, అవగాహన ఉన్నప్పటికీ అంకితభావంతో స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్తలు లేరు. 

సేవలను వాణిజ్యపరం కావించడంతో వారిలోని స్వచ్చందతను హరించి వేస్తున్నది. స్వచ్ఛంద సేవకులు ఆపద సమయంలో వెంటనే స్పందిస్తుండగా, వృత్తిగా పనిచేసేవారు సమయం కోసం వేచి ఉండడం కనిపిస్తుంది. 

సామజిక సంస్థల పని నమూనా  ఎన్జీఓలతో పోల్చితే మరింత అర్ధవంతంగా, సమర్ధవంతంగా ఉంటున్నది. ఎన్జీఓలు తమ పనుల ద్వారా చాలామంది లబ్ధిదారులను తయారు ధేస్తున్నప్పటికీ స్వచ్ఛంద సేవకులను మాత్రం తయారు చేయలేక పోతున్నాయి. పైగా ఈ సంస్థలు తమ లక్ష్యాలను మించి సామాజికి సేవలు అందించలేవు. 

ఉదాహరణకు విద్యారంగంలో ఒక ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న వారు తమకు నిధులు ఇచ్చేవారు అడిగితే తప్ప ఒక ఆకస్మిక విపత్తులో పనిచేయలేరు. అందుకనే నేడు మనదేశంలో ఉన్న వేలాది ఎన్జీఓలు తమ వృత్తిపర మైన అవసరాలు, జాతీయ బాధ్యతల మధ్య నలిగిపోతున్నాయి. 

కానీ సామజిక సంస్థల అలక్ష్యాలు స్పష్టంగా ఉంటాయి. భారతీయ జీవన విలుల ఆధారంగా పనిచేస్తూ లక్షలాది మంది ఎటువంటి పేరు, ప్రఖ్యాతులు, ప్రతిఫలం  ఆశింపకుండా అందిస్తున్న సహాకారం పునాదిగా స్థానికంగానే వనరులను సమీకరించుకొంటున్న వారి నుండి నేర్చుకోవలసింది ఎంతో ఉన్నదని గ్రహించాలి.