ఆర్ ఎస్ ఎస్ నేత హత్యలో ఉగ్రవాది అరెస్ట్ 

ఆర్ ఎస్ ఎస్ నేత హత్యతో సంబంధం ఉన్న హిజబుల్ ముజాహిదీన్ ఉగ్రవాది ని జమ్మూ కాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలోని హంజాల ప్రాంతంలో ఎన్ ఐ ఎ బృందం అరెస్ట్ చేసింది. అతనిని రుస్తాం అలీ గా గుర్తించారు. 

గత ఏడాది ఏప్రిల్ లో ఆర్ ఎస్ ఎస్ నేత చంద్ర కాంత్ శర్మ, ఆయన వ్యక్తిగత భద్రతా అధికారిని హత్యచేసిన కేసులో ఎన్ ఐ ఎ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో అతనిని  నిందితుడిగా పేర్కొన్నారు. 

గత ఏడాది సెప్టెంబర్ 23న జమ్మూ కాశ్మీర్ పోలీసులు  సీనియర్ బిజెపి నేత, ఒక ఆర్ ఎస్ ఎస్ నేతల హత్యా కేయూస్లో హిజబుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు నిస్సార్ అహ్మద్ షేక్, నిషాద్ అహ్మద్, ఆజాద్ హుస్సేన్ లను అరెస్ట్ చేశారు.    

2018లో బిజెపి రాష్ట్ర కార్యదర్శి అనిల్ పరిహార్ ను హత్యా కావించగా, గత ఏడాది ఏప్రిల్ లో సీనియర్ ఆర్ ఎస్ ఎస్ నేత శర్మ, ఆయన వ్యక్తిగత భద్రతా అధికారిని కాల్చి చంపారు. ఈ రెండు హత్యలు కిష్త్వార్ లలో నిరసనలకు దారితీసాయి. 

అధికార వర్గాల కధనం ప్రకారం కిష్త్వార్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలను పునరుద్దరించే కుట్రతో ఈ హత్యలకు పాల్పడ్డారు. సుదీర్ఘకాలం హిజబుల్ ముజాహిదీన్ కమాండర్ గా ఈ ప్రాంతంలో పనిచేసిన జహంగీర్ సారూరి వీటికి సూత్రధారి.