బెంగాల్ కు కరొనపై హోమ్ మంత్రిత్వ శాఖ బృందం!

మొత్తం ప్రపంచం కరోనా మహమ్మారి కట్టడిలో నిమగ్నమై ఉన్న సమయంలో పశ్చిమ బెంగాల్ లో మాత్రం ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతున్నట్లు విమర్శలు చెలరేగుతున్నాయి. ఎంతమంది వైరస్ కు గురయ్యారో, ఎంతమంది చనిపోయారో వివరాలు పూర్తిగా వెల్లడించడం లేదు. మరోవంక పిపిఇ తగినన్ని లేవని వైద్యులు, తగిన ఆహరం అందించడం లేదని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇంతకు ముందు కేంద్రం నుండి అంతర్ మంత్రిత్వ శాఖల బృందం బెంగాల్ లో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసినా ప్రయోజనం లేకపోయింది. దానితో తాజాగా ఒక ప్రత్యేక బృందాన్ని పంపి, వాస్తవాన్ని కలకత్తా హైకోర్ట్ కు నివేదించడానికి కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ సంసిద్ధతను వ్యక్తం చేసింది. 

రాష్ట్రంలో కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానలను మరుగు పరుస్తున్నదని వస్తున్న ఆరోపణలను కలకత్తా హై కోర్ట్ దృష్టికి తీసుకు వస్తూ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి  కబీర్ శంకర్ బోస్ తీసుకువచ్చారు. కోర్ట్ సూచనపై పశ్సీమ బెంగాల్ కు ఒక బృందం పంపడానికి కేంద్ర హోమ్ శాఖ ఆమోదం తెలిపింది. అయితే ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వారం రోజులలో నివేదిక సమర్పించాలని కోర్ట్ ఆదేశించింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై అంచనా వేయడం కోసం కేంద్ర బృందం రావాలి అనుకొంటే రావచ్చని కూడా స్పష్టం చేసియింది. 

కేంద్ర బృందం పర్యటిస్తే విపత్తు యాజమాన్య చట్టం పరిధిలోకి వస్తుందని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై హై కోర్ట్ కు సాధికారికతతో నివేదిక ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని శంకర్ బోస్ కోర్ట్ కు తెలిపారు. కేంద్ర బృందం రావడం రాష్ట్ర ప్రజలకు ఆక్సిజన్ అందించడం వంటిది కాగలదని పేర్కొన్నారు.