గిల్లి ఖజ్జాలతో దళితులపై దాడి 

కొమరం భీమ్ జిల్లా, సిర్పూర్ కాగజనగర్ లో చిన్న పిల్లల మధ్య మొదలైన చిన్నపాటి గొడవ ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పొద్దుపోయాక దళితుల ఇండ్లపై స్థానిక ముస్లిములు దాడి చేసి, ఇండ్లలో ఉన్న చిన్న పిల్లలు, మహిళలను రక్తం వచ్చేలా గాయపరిచారు.

ఘటనకు సంబంధించి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఏడుగురు వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు, లాక్-డౌన్ అమలులో ఉన్నందున విపత్తు నివారణ, అంటువ్యాధుల నివారణ చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

తొలుత సోమవారం రాత్రి ఘటన జరిగిన వెంటనే బాధిత దళితులతో పాటు స్థానిక బీజేపీ, భజరంగ్ దళ్ నేతలు రావి శ్రీనివాస్, శివగౌడ్ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్లగా, ఫిర్యాదు తీసుకోకపోగా, "దళితులపై దాడులు చేస్తే మీకేంటిరా బాధ?" వాళ్ళది వేరే కులం మీది వేరే కులం" అంటూ పోలీస్ అధికారి వారిపై దుర్భాషలాడినట్లు చెబుతున్నారు. 

అంతే కాకుండా, అందరినీ కేసులు పెట్టి జైల్లో వేస్తా  అని వీరంగం సృష్టించి బీజేపీ నేత రావి శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకున్నారు.  దీంతో జిల్లా బీజేపీ, బజరంగదళ్ కార్యకర్తలు సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ తీరుపై కొమరం భీమ్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.