కాశ్మీర్ ప్రాంతం భారత్ దే .. తాలిబన్ స్పష్టం 

కశ్మీర్ ప్రాంతం భారత్ దేనని అంటూ తాలిబన్ కీలకమైన ప్రకటన చేసింది. కాశ్మీర్ తమదే అంటూ అక్కడ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ కు ఈ ప్రకటన ఒక విధంగా చెంపపెట్టు కాగలదు. ఎందుకంటె తాలిబాన్లకు పాకిస్థాన్ సైన్యం అండగా ఉంటూ వస్తున్నది. 

పైగా, కాశ్మీర్ లో పాకిస్థాన్ ప్రోద్బలంతో సాగుతున్న ఉగ్రవాదంతో ఎట్టి పరిస్థితులలో తాము భాగం కాబోమని ఆ సంస్థ రాజకీయ విభాగం ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ ట్విట్టర్ లో వెల్లడించారు. 

కశ్మీర్ అనేది భారత్ అంతర్గత సమస్య అని తేల్చి చెప్పారు. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవటమనేది తాలిబన్ల విధానం కాదని ట్వీట్ లో స్పష్టంగా తెలిపారు. 

కశ్మీర్ సమస్య పరిష్కరమయ్యే వరకు భారత్ తో సంబంధాలు కొనసాగే ప్రసక్తే లేదంటూ తాలిబన్లు పేర్కొన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరింప చేసుకోంది. 

దీంతో తాలిబన్ రాజకీయ విభాగం ఇదంతా తప్పుడు ప్రచారమంటూ స్పష్టత ఇచ్చింది. దీంతో కశ్మీర్ పై పాకిస్తాన్ చేస్తున్న వింత వాదనకు తాలిబన్ల నుంచి కూడా మద్దతు లేదని తేలిపోయింది. 

ఆఫ్ఘానిస్తాన్ నుండి అమెరికా సేనలు వైదొలగిన తర్వాత అక్కడ రాజకీయ ఆధిపత్యం పొందడం కోసం ఎదురు చూస్తున్న తాలిబన్లు అందుకు భారత్ మద్దతు కీలకం అని భావించడం వల్లననే వ్యూహాత్మకంగా ఇటువంటి ప్రకటన చేసిన్నట్లు కనబడుతున్నది. 

ఆఫ్ఘానిస్తాన్ పుననిర్మాణ కార్యక్రమాలో భారత్ ప్రధాన భాగస్వామి కావడంతో భారత్ సహకారం లేకుండా తమ దేశ అభివృద్ధి సాధ్యం కాదని వారు గ్రహించినట్లు కనిపిస్తున్నది.