కరొనపై పోరుతో ధృడమైన నేతగా మోదీ

* ప్రజాదరణతో ట్రంప్, పుతిన్ లకన్నా ముందంజ 

* మోదీ చర్యలకు 90 శాతం ప్రజల మద్దతు 

గత ఏడాది లోక్ సభ ఎన్నికలలో అనూహ్యమైన ఆధిక్యతతో రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన నరేంద్ర మోదీ ప్రతిష్ట ఆ తర్వాత కొంతమేరకు తగ్గుతూ వచ్చింది. వరుసగా కొన్ని రాష్ట్ర అసెంబ్లీలలో బిజెపి పరాజయం,  ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ వంటి అంశాలతో ముస్లింల పట్ల వివక్షత చూపుతున్నారని అంతర్జాతీయంగా దుష్ప్రచారం జరగడంతో కొంత ఆత్మరక్షణలో పడ్డారు.   

కానీ ప్రస్తుతం కరోనా సంక్షోభాన్ని ప్రధాని మోడీ ఎదుర్కొంటోన్న తీరు పట్ల మొత్తం ప్రపంచంలో ఆయన ప్రతిష్ట ఎంతగానో పెరుగుతున్నది. ఆయన వ్యవహరిస్తున్న తీరును న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రశంసించింది. కరోనా నివారణ చర్యల విషయంలో ప్రధాని మోడీ తీసుకుంటున్న చర్యల పట్ల ప్రజలు పూర్తిగా అమద్దతు పలుకుతున్నారని తెలిపింది. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ల కన్నా మోడీకి అమోఘమైన ప్రజాదరణ దక్కుతోందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో రాయటం విశేషం. ఆ ఇద్దరు నాయకులు కరోనా కట్టడిలో సమర్ధవంతంగా వ్యవహరింపలేక పోతున్నట్లు ఆయా దేశాల ప్రజలు భావిస్తున్నట్లు స్పష్టం చేసింది.   

ప్రధాని మోడీని ఓ మొబిలైజర్ గా వర్ణించింది. న్యూయార్క్ టైమ్స్ కరోనా టైమ్ లో మోడీ ప్రాభవం మరింత పెరిగిందంటూ కథనాన్ని ప్రచురించింది. దాదాపు 90 శాతం మంది మోడీ నిర్ణయాలకు మద్దతుగా ఉంటారని కథనంలో పేర్కొంది.

అందుకు ఉదాహరణగా జనతా కర్ఫ్యూ, కరోనా వారియర్స్ ను చప్పట్లు కొడుతూ అభినందించటం, దీపాలు వెలిగించటం వంటి కార్యక్రమాలకు ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుకు ప్రజలకు స్పందించిన తీరును వివరించింది. మొదటి లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుంచి ప్రధాని తీసుకుంటున్న చర్యలను ఆయన పనితీరును కథనంలో ప్రశంసిస్తూ రాసింది.

సిద్ధాంతాలతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, వ్యక్తుల అభిప్రాయాలను తీసుకొని కరోనా నివారణకు కృషి చేస్తున్నారని, అదే విధంగా ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఇప్పటికే నాలుగు సార్లు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారని తెలిపింది. .

కరోనా సంక్షోభంలో మోడీ వ్యవహారిస్తున్న తీరు ఆయన ప్రాభవాన్ని పెంచుతోందని వెల్లడించింది. 2019  లో మోడీ తిరిగి ఎన్నికయ్యాక పుల్వామా దాడి ఘటన ఆయన్ను బలమైన నేతగా నిలిపితే, తాజా కరోనా సంక్షోభం మరింత దృఢమైన నాయకుడిగా ఆవిష్కరించిందని న్యూయార్క్ టైమ్ పేర్కొంది. 

అదే విధంగా ర్స్ వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులను కూడా న్యూయార్క్ టైమ్స్ ప్రస్తావించింది. వారికి సరైన వసతులు కల్పించకపోవటంతో తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారంటూ యూపీలోని ఔరియాలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని ప్రస్తావించింది. ఐతే భారత్ లో  నమోదవుతున్న కేసులు, మరణాల రేట్ ఇక్కడి జనాభాతో పోల్చుకుంటే చాలా తక్కువంటూ న్యూయార్క్ టైమ్స్ స్పష్టం చేసింది.