నదుల అనుసంధాన రూపకర్త డా.కె.ఎల్.రావు 

* అపర భగీరధుడి వర్ధంతి నేడు 

* గ్రామీణ విద్యుత్ ఆద్యుడు

భారత దేశంలో అనేక నీటిపారుదల ప్రాజెక్ట్ లకు రూపకల్పన చేయడంతో పాటు దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి నదుల అనుసంధానం చేపట్టాలని సూచించడమే కాకుండా, అందుకు నిర్దిష్ట ప్రణాలికను దేశం ముందుంచిన `అపర భగీరధుడు', మాజీ కేంద్ర మంత్రి డా. కె ఎల్ రావు వర్ధంతి నేడు. 

భారత్ నీటి వనరుల ఆద్యుడు', నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ రూపకర్త, ముగ్గురు ప్రధాన మంత్రుల మంత్రివర్గాలలో జలవనరులు, విద్యుత్ శాఖలు నిర్వహించిన భారతీయ నీటి వనరుల నిపుణుడు - పద్మభూషణ్ డాక్టర్ కానూరి లక్ష్మణ (కే ఎల్) రావు మన దేశంలో గ్రామీణ విద్యుతీకరణకు సహితం ఆద్యుడు. 

భారత దేశంలో జల వనరుల అభివృద్ధికి, వాటిని సేధ్య వినియోగానికి, నీటి యద్ధడి ఉన్న ప్రాంతాల నీటి అవసరాలు సమకూర్చడానికి బృహత్ ప్రణాళికలకు శ్రీక్రారం చుట్టి -కోశీ, హిరాకుడ్, చంబల్, ఫరక్క, శ్రీశైలం, తుంగభద్ర, నాగార్జున సాగర్ ఆనకట్టలు రూపొందించడమే కాక  గ్రామీణ విద్యుదీకరణ విశేష అభివృద్దికి తోడ్పడ్డ క్షేత్రజ్ఞ నిపుణుడు. ప్రపంచంలో అత్యంత పొడవైన " అర్తెన్ డాం " ఆనకట్టను కృష్ణా నది మీద నిర్మించారు.

మూడు వందలకు పైగా సాంకేతిక రచనలు చేశారు. వీరు రచించిన " స్ట్రక్చరల్ ఇంజినీరింగ్  అండ్ రీ ఇంఫోర్స్డ్ కాంక్రీట్ " పుస్తకం ఈ క్షేత్రంలో ప్రామాణిక గ్రంధం.ఆటోబయోగ్రఫీ " ది క్యూసెక్స్ కాండిడేట్ " మొదలగు పుస్తకాలు రాసారు. ఒక ఆచార్యుడిగా, కేంద్ర మంత్రి గా, ఇంజినీరుగా వీరి దూరాలోచన కారణంగా భారత దేశంలో కోట్లాది మందికి తిండి లభిస్తోంది.

కృష్ణాజిల్లా కంకిపాడులో జులై 15, 1902న జన్మించిన కె ఎల్ రావు మేధాసంపత్తికి జవహర్ సాగర్, గాణీనగర్, రాణా ప్రతాప్ సాగర్ నిర్మాణపు పనులు నిదర్శనాలు.  భారత ప్రధానులు - నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధి ప్రభుత్వాలలో నీటి పారుదల, జల వనరుల మంత్రిగా  పదేళ్లపాడు పనిచేశారు. విజయవాడ నుండి లోక్ సభకు 1962 నుండి 1977 వరకు వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యారు.  మే 18, 1986 లో మరణించారు.  

మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన తన తొమ్మిదవ ఏటనే తండ్రిని కోల్పోయారు. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఇంజినీరింగ్ డిగ్రీ లో మాస్టర్స్ పట్టా సాధించిన ప్రప్రధములు. ఇంగ్లాండ్ లోని బ్ర్మింగ్ హాం విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. డాక్టరేట్ పట్టా సాదించిన తరువాత అక్కేడే (ఉప) ఆచార్యుడిగా పనిచేశారు. అప్పటి మద్రాస్ ప్రభుత్వంలో డిసైన్ ఇంజినీర్ గా కొంత కాలం పనిచేశారు. మరికొంత కొంత కాలం సి డబ్లు సి సభ్యులు గా ఉన్నారు.

ఢిల్లీ, విద్యుత్ కమీషన్ సంచాలకుడిగా పనిచేసి, తరువాత ముఖ్య (చీఫ్) ఇంజినీర్ గా కొంత కాలం పనిచేశారు. " ఇండియా'స్ వాటర్ వెల్త్ " పుస్తకం ఈ క్షేత్రంలో శాస్త్రజ్ఞులకి సైతం ప్రామాణిక గ్రంధం.

విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కూడా కే ఎల్ రావు గారి మేధా సంపత్తి నిర్దర్శనమే. గ్రామీణ విద్యుదీకరణ సంస్థ వీరి హయాం లోనే నెలకొల్పారు. గంగా, బ్రహ్మపుత్ర వరధ నివారణ చర్యలకు కీలక సలహాలు అందించారు. డాక్టర్ కే ఎల్ రావు గారు అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2006 లో గుంటూర్ జిల్లా లోని బెల్లంకొండ పులిచింతల ప్రాజెక్టుకు కే ఎల్ సాగర్ ప్రాజెక్ట్ గా నామకరణం చేసింది.

భారత దేశ నదులని అనుసంధానం చేయాలని (సర్వే) చేశారు. అయితే ఆయన సూచనను కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ విషయంలో వాజపేయి ప్రభుత్వం కొంత కృషి చేసినా ఒక దశకు చేరుకోలేదు. ఆయన ఆశించిన భారతీయ జీవ నదులు గంగా, బ్రహ్మపుత్రను, గంగా కావేరీ నదులను కలిపే బృహత్తర ప్రణాళికల రూపకల్పన రానున్న కాలంలో సాఫల్యం అయి నీటి యద్ధడి తీరుస్తుందని ఆసిద్ధాం. భారత దేశానికి ఓ సంగ్రహ విద్యుత్ (గ్రిడ్) రూపొందించాలని ఆకాంక్షించారు. ఈ రెండూ  నెరవేర్చడమే మనం ఆయనకు ఇవ్వగలిగే నివాళి.

(ఉపాధ్యాయ సేవాకేంద్రం,విజయవాడనుండి)