నాలుగు రాష్ట్రాల ప్రజలపై కర్ణాటక నిషేధం 

 మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కేరళకు చెందిన ప్రజలు తమ రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.  దేశంలో కరోనా కేసులు అత్యధికంగా రాష్ట్రాలలోనే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి ముఖ్యమంత్రి బీఎస్‌ యెడియూరప్ప ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

ఈ నెల 31 వరకు ఇది అమల్లో ఉంటుందని ప్రకటించింది. కర్ణాటకలో ఈ నెలాఖరు వరకు ప్రతి ఆదివారం పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని, నిత్యావసరాలకు మాత్రమే అనుమతి ఉంటుంది వెల్లడించింది. రాష్ట్రంలో తాజా ప్రజా రవాణా వ్యవస్థకు ప్రభుత్వం అనుమతించింది.   

కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు అనుమతించబడుతాయని పేర్కొన్నారు. ఆదివారం రోజు రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. హోం క్వారంటైన్‌ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. 

అన్ని దుకాణాలు తెరువబడుతాయని సీఎం చెప్పారు. రాష్ట్ర పరిధిలో అన్ని రైళ్లు నడుస్తాయని సీఎం యోడియూరప్ప వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,100 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ వల్ల రాష్ట్రంలో 30 మంది మరణించారు. గత 24 గంటల్లో కొత్తగా 84 కరోనా కేసులు నమోదయ్యాయి.