గాంధీలో మత్తుగా విందు... ఒకరి మృతి 

తెలంగాణ మొత్తానికి కొవిడ్‌ చికిత్సకు కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో విశేషమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఎన్నో లొసుగులు ఉన్నట్లు మరోసారి స్పష్టమైనది. ఆసుపత్రిలోనే ముగ్గురు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు మత్తుగా మద్యంతో తెల్లవార్లు విందు చేసుకోగా, వారిలో ఒకరు ఇంటికి వెళ్లి మృతి చెందారని వెల్లడైనది. 

ఈ సంఘటన ఆసుపత్రి అధికారులకు దిగ్బ్రాంతి కలిగించింది. శనివారం అర్ధరాత్రి నుండి ప్రారంభించి  ఆదివారం తెల్లవారు జాము వరకు విందు చేసుకున్నారని తెలిసింది. తర్వాత ఎవరింటికి వారు వెళ్లిపోయారు. ఓ వ్యక్తి ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికి గుండెపోటుతో చనిపోయాడు. 

విందు వ్యవహారం ఆస్పత్రి ఉన్నతాధికారులకు తెలియడంతో విచారణ చేపట్టారు. ఆస్పత్రిలోకి మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయి?  సెల్లార్‌లో గంటల తరబడి విందు చేసుకుంటే ఆస్పత్రి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు పట్టించుకోలేదు? వంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఆస్పత్రిలో అడుగడుగునా బందోబస్తు ఉన్నప్పటికీ విందు విషయం పోలీసులు తెలుసుకోలేకపోయారు. లోతుగా దర్యాప్తు చేస్తే  మరెన్నో లోపాలు  వెలుగులోకి  రాగలవని భావిస్తున్నారుఆదివారం పెద్దగా పట్టించుకోని అధికారులు సోమవారం పూర్తిస్థాయిలో విచారణ జరిపే అవకాశం ఉంది.