చైనాకు మళ్లీ పొంచి ఉన్న కరోనా ముప్పు

కరోనా వైరస్ పుట్టిన చైనా ఇంకా ఆ ముప్పు నుంచి బయటపడలేని వెల్లడి అవుతున్నది. దాదాపుగా ఈ వైరస్ ను కట్టడి చేశామని చైనా ప్రభుత్వం చెప్పుకొంటున్న అసలు ప్రమాదం ముందున్నదని నిపుణులు భావిస్తున్నారు. 

చైనాలోని ప్రముఖ ఆరోగ్య నిపుణులు డాక్టర్ జాంగ్ నాన్ షాన్ ఈ హెచ్చరిక చేస్తున్నారు.  2003 లో చైనాలో సార్స్ ను ఎదుర్కోవటంలో జోంగ్ కీలక పాత్ర పోషించారు. అందుకే చైనాలో ఆయనను సార్స్ హీరో అని పిలుస్తారు. ప్రస్తుతం కరోనా నివారణలో కూడా ఆయన కీలకంగా వ్యవహారిస్తున్నారు. అలాంటి డాక్టర్ జాంగ్ నాన్ షాన్ కరోనా ప్రమాదం చైనాకు ముందు ముందుందని  స్పష్టం చేస్తున్నారు. 

ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చైనీయులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని, ఇది భవిష్యత్ లో పెద్ద సమస్యగా మారుతుందని చెప్పారు. కరోనా ముప్పు చైనాకు రెండో దశలో పెను సవాల్ గా మారనుందని పేర్కొన్నారు. చాలా మంది దీని బారిన పడనున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

విదేశాలతో పోలిస్తే చైనాయే ఎక్కువగా కరోనా కారణంగా ప్రభావితం అవుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం కరోనాను అదుపు చేశామన్న భావనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారించవద్దని, మరింత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు చెప్పారు. 

కరోనా తీవ్రత మొదట్లో చైనాలోని అధికారులు తక్కువ చేసి చూపారని స్పష్టంగా చెప్పారు. పెను సవాల్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సి ఉందని డాక్టర్ జాంగ్ నాన్ షాన్ చెప్పారు. మొదట్లో చైనా లో భారీగా కేసులు నమోదైనప్పటికీ రెండు వారాల క్రితం నాటికి దాదాపు కరోనా అదుపులోకి వచ్చింది. దీంతో వుహాన్ లో లాక్ డౌన్ ను ఎత్తి వేశారు. కానీ మళ్లీ కొత్త కేసులు మొదలయ్యాయి.