ఆరేళ్ల సన్యాసికి చైనా భయపడినప్పుడు 

అమృత్ జోషి

* 11 వ పంచెన్ లామా అపహరణకు 25 ఏళ్ళు  

అతని పేరు గెడున్ చొకి న్యిమా. టిబెట్ లోని న్గచువ్ రాష్ట్రం లహరి జిల్లాలో విశేషమైన లక్షణాలతో జన్మించాడు. టిబెట్ అత్యున్నత, ధార్మిక నేత యినా 14వ దలైలామా దృష్టికి ఆ బాలుడి గురించి తాషి లామో బౌద్ధ మొనాస్టరీ కి చెందిన అబాట్ చాడ్రెల్ రిన్‌పోచే తీసుకొచ్చారు. అప్పుడు ఆ బాలుడికి ఆరేళ్ళ వయస్సు. పునర్జన్మను గుర్తించడానికి విస్తృతమైన మతపరమైన ఆచారాలు న్రివహించిన దలైలా 1995 మే 14న గెధున్ చోకియి నైమాను 11 వ పంచెన్ లామాగా గుర్తించారు.

అయితే ఆ వెంటనే మూడు రోజులకే 1995 మే 17న చైనా అధికారులు అతనిని, అతని కుటుంభం అంతటిని  అపహరించారు. చంద్రేల్ రిపోచేను కూడా నిర్బంధించారు. అప్పటి నుండి ఆ బాలుడి గురించి ఎటువంటి సమాచారం ఇవ్వడానికి కూడా చైనా తిరస్కరిస్తున్నది. పైగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ నేత కుమారుడిని 11వ పంచెన్ లామాగా చైనా నియమించింది. 

అప్పటి ప్రపంచంలో అతి పిన్న వయస్కుడైన రాజకీయ ఖైదీ అయిన 11 వ పంచెన్ లామా గెధున్ చోకియి నైమా అదృశ్యం టిబెట్‌లో గత ఆరు దశాబ్దాలలో ప్రబలిన టిబెటన్ల మానవ హక్కుల ఉల్లంఘనలకు పరాకాష్టగా పేర్కొనవచ్చు. 12 లక్షల మందికి పైగా టిబెట్ ప్రజలను వాదించారు. మరి అనేకమందిని నిర్బంధ శిబిరాలకు తరలించారు. చైనాలో 6,000 మొనాస్టరీస్ లను ధ్వంసం చేశారు. 

పంచెన్ లామాను అపహరించినప్పుడు అసలు తామేమి చేయలేదని ఐక్యరాజ్య సమితిలో బుకాయించిన చైనా ఒక సంవత్సరం తర్వాత `రక్షణ కోసం నిర్బంధం' అంటూ వాదించింది. టిబెటన్ బౌద్ధ వారసత్వంలో దలైలామా వంశం అత్యున్నత సంస్థ కాగా, పంచెన్ లామా వ్యవస్థకు ఆ తర్వాతి స్థానం లభిస్తుంది. ఇది. రెండింటినీ టిబెటన్ బౌద్ధ ప్రపంచంలోని సూర్యుడు, చంద్రుడు అని పిలుస్తారు. 

ఈ రెండూ నిస్సందేహంగా టిబెటన్ సమాజంలో గౌరవం, ప్రభావం గల వ్యవస్థలు. మతపరమైన వారసత్వం యొక్క అధికారిక ముద్రతో పునర్జన్మ ద్వారా రెండు స్థానాలను నిర్ణయిస్తారు. ప్రస్తుత దలైలామా దలైలామా సంప్రదాయంలో 14 వ అవతారం. అదేవిధంగా, తప్పిపోయిన పంచెన్ లామా పంచెన్ లామా వారసత్వం యొక్క 11 వ అవతారం.

మరో ముఖ్యమైన వంశం "కర్మపా". ప్రస్తుత 17 వ కర్మపాను చైనా గుర్తించింది.  అతనిని  తమ  నియంత్రణలో ఉంచుకొనే ప్రయత్నం చేసింది. కానీ 17 వ కర్మపా చైనా నుండి పారిపోయి 1999 లో భారతదేశానికి చేరుకున్నారు. పంచెన్ లామాను గుర్తించడంలో దలైలామా పాత్ర ముఖ్యమైనది కాగా, తదుపరి దలైలామా  నిర్ణయించడంలో పంచెన్ లామా పాత్ర కూడా ముఖ్యమైనది.

11 వ పంచెన్ లామాను అపహరించడం, వారి కీలు బొమ్మ పంచెన్ లామాను ఆ సీటులో ఏర్పాటు చేయడం ద్వారా తదుపరి దలైలామాను నిర్ణయించడంలో తమ కీలుబొమ్మ ప్రభావం చూపేటట్లు చేయాలని చైనా ప్రయత్నం. అయితే చైనా కుయుక్తులను నేడు మొత్తం ప్రపంచం గుర్థించింది. 

అయితే తన వారసుడు స్వేచ్ఛలేని దేశంలో జన్మించరని స్పష్టం చేయడం ద్వారా చైనా సూచించిన వ్యక్తి తన వారసుడు కాబోరని దలైలామా కొద్దికాలం క్రితం స్పష్టం చేశారు. భారత్ లోనే ఉండిఉండొచ్చనే సంకేతం ఇచ్చారు. ప్రస్తుతం 84 సంవత్సరాల వయసులో ఉన్న దలైలామాకు చెప్పుకోదగిన ఆరోగ్య సమస్యలు లేవు. అందుకనే 90 సంవత్సరాల వయసులో తన వారసుడి గురించి చర్చిస్తానని ప్రకటించారు. 

అవిశ్వాసం, చాకచక్యం, అనాగరికత, అధికారం కోసం దాహం మొదలైనవి అసలు చైనా నాగరికతలో భాగం కాకపోవచ్చు. చైనాలో గత ఏడు దశాబ్దాలుగా కమ్యూనిజం అనే విధ్వంసక  భావజాలాన్ని దాని పూర్తి రూపంలో గ్రహించడం ఇక్కడ మనం చూస్తున్నాం.

చైనా కోసం ప్రస్తుత దలైలామా , తదుపరి దలైలామాపై ఆయన తీసుకున్న నిర్ణయం చాలా కీలకం కానున్నది. ఎందుకంటే ప్రధాన భూమి చైనాలో, ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధమతం యొక్క ప్రజాదరణ పెరుగుతోంది. 6 వ దలైలామా అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ బౌద్ధ ఆశ్రమానికి చెందిన వారు కావడంతో అరుణాచల్ ప్రదేశ్‌ తమదే అంటూ చైనా తరచుగా భారత్‌తో వివాదాలకు కాలుదువ్వుతూ ఉంటుంది. 

ఈ రోజు మే 17, 2020, గెధున్ చోకియి నైమా, అతని కుటుంబ సభ్యుల అదృశ్యానికి పావు శతాబ్దం గడిచింది. ఇది అతనికి, అతని కుటుంబానికి, టిబెటన్ ప్రజలకు వ్యతిరేకంగా మాత్రమే కాకుండా, మొత్తం మానవ హక్కుల పవిత్రతను విశ్వసించే ప్రతి ఒక్కరిపై చైనా సాగిస్తున్న ఘోరంగా నేరం. 

ఇది మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరం. ఈ దారుణమైన చర్యకు చైనా బాధ్యత వహించాలి. సమానత్వం, మానవ హక్కులు, శాంతి బోధకులు అని పిలవబడే ఉద్యమకారులు ఎప్పుడూ ఈ విషయమై స్వరం వినిపించకుండా మౌనం వహిస్తున్నారు. 

ఈ సందర్భంగా, అంతర్జాతీయ మత స్వేచ్ఛ కోసం యుఎస్ రాయబారి, సామ్ బ్రౌన్బ్యాక్ గురువారం ఒక కాన్ఫరెన్స్ కాల్‌లో టిబెట్ యొక్క పంచెన్ రిన్‌పోచే ఎక్కడ ఉందో చైనా ప్రపంచానికి తెలియజేయాలని డిమాండ్ చేశారు. 

ఈ రోజు కోవిడ్ 19 వెలుగులో చైనా విశ్వసనీయత పరంగా మరోసారి ప్రపంచం ముందు బహిర్గతమైంది. అవిశ్వాసం, చాకచక్యం, అనాగరికత, అధికారం కోసం దాహం మొదలైనవి అసలు చైనా నాగరికతలో భాగం కాకపోవచ్చు. చైనాలో గత ఏడు దశాబ్దాలుగా ప్రవచిస్తున్న మ్యూనిజం అనే విధ్వంసక  భావజాలాన్ని పూర్తి రూపంలో గ్రహించడం మనం ఇక్కడ చూస్తున్నాం.

(న్యూస్-13  వెబ్ సైట్ నుండి)