తైవాన్ సభ్యత్వం కోసం భారత్ పట్టు 

చైనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పెరుగున్న చైనా వ్యతిరేకతను ఆసరా చేసుకొని అంతర్జాతీయ వేదికలపై ఆ దేశపు ప్రాధాన్యతను తగ్గించడం కోసం భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రారంభించింది. కరోనా వైరస్ ను ప్రజాస్వామ్య పంధాలో విజయవంతంగా కట్టడి చేయడంలో విజయం సాధించిన తైవాన్ కు పరిశీలక హోదాలో ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సభ్యత్వం ఇవ్వాలని భారత్ పట్టుబడుతున్నది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశం కోవిడ్ - 19 మహమ్మారి గురించి చర్చించడానికి మే 18న సమావేశం జరుగనున్నది. ఈ సంస్థ కీలక విధాన నిర్ణయ వేదిక అయినా ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ లో తైవాన్ హోదా గురించి ఇక్కడ వోటింగ్ జరుగనున్నది. చైనా కు తైవాన్ పేరు అంటేనే అసహనంపై గురవుతుంది. అది తమ దేశంలో భాగమని వాదిస్తుంటుంది. 

ఈ సందర్భంగా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, న్యూజీలాండ్, దక్షిణ కొరియా, వియత్నాం వంటి దేశాలతో మన విదేశాంగ కార్యదశి హర్ష వర్ధన్ శృంగలా మార్చ్ 20 నుండి సమాలోచనలు జరుపుతూ, తైవాన్ కు మద్దతుగా అంతర్జాతీయంగా బలం సమీకరణకు ప్రయత్నం చేస్తున్నారు. 

తైవాన్ అందించే సమాచారం కరొనపై కట్టడిలో అర్ధవంతం, ప్రాధాన్యత గలవని పేర్కొంటూ ఆ దేశానికి పరిశీలన కల్పించాలని అంటూ అమెరికా,  జపాన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ సంయుక్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు సూచించాయి. దానితో వారిపై చైనా చిందులు వేస్తున్నది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలైన రష్యా తప్ప మిగిలిన అన్ని దేశాలు ఈ ప్రతిపాదనకు సుముఖత వ్యక్తం చేస్తుండగా, చైనా మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.

 ఇలా ఉండగా, ఈ విషయమై భారత్ తో సంబంధాలు ఏర్పరచుకోవడం పట్ల తైవాన్ ఆసక్తి కనబరుస్తున్నది.  కోవిడ్ -19 కి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటంలో మెరుగైన సహకారం ఏర్పోర్హ్చుకోవడమా కోసం తమ దేశం భారత్ తో నిరంతరం సమాచారం పంచుకోవాలని ప్రతిపాదిస్తున్నట్లు తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వు తెలిపారు.