ఎంఐఎం ఎమ్మెల్యేపై చర్య తీసుకోరా  - రాజాసింగ్ !

లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన‌ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మ‌ద్ బిన్ అబ్దుల్లా బ‌లాలాపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్  డిమాండ్ చేశారు. శుక్ర‌వారం ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే ద‌బీర్‌పుర ఫ్లైఓవ‌ర్ బ్రిడ్జిపై ఉన్నబారికేడ్‌‌ను బ‌ల‌వంతంగా తొల‌గించారని గుర్తు చేశారు. 

 బ‌లాలాతోపాటు ఎంఐఎం మిగ‌తా ఎమ్మెల్యేలు హైద‌రాబాద్ ఓల్డ్ సీటీలో లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం లేద‌ని, వీరిపై  కూడా చ‌ర్చ‌లు తీసుకోవాలని రాజా సింగ్ స్పష్టం చేశారు.  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఎంఐఎం ఎమ్యెల్యే పై చర్యకు వెనుకాడుతున్నారని ధ్వజమెత్తారు. 

ఓ వైపు క‌రోనాతో దేశం పోరాడుతుంటే బ‌లాలా వంటి ఎంఐఎం పార్టీ నేత‌లు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం లేద‌ని రాజాసింగ్ మండిప‌డ్డారు. అధికారుల ఆదేశాలు పాటించ‌కుండా పోలీసుల‌కు, డాక్ట‌ర్ల‌కు ఇబ్బంది క‌లిగిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. అస‌లు ఈ చ‌ర్య‌ల‌న్నింటి వెన‌క ఎంపీ అస‌దుద్దీన్‌ ఓవైసీ హ‌స్తం ఉందని ఆరోపించారు. 

ఓ వైపు ప్ర‌జ‌ల‌కు మంచిగా క‌నిపిస్తూ మ‌రోవైపు త‌న ఎమ్మెల్యేలు, కార్పొరేట‌ర్ల‌తో నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌మ‌ని ఒవైసి ప్రేరేపిస్తున్నారని విమ‌ర్శించారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించిన ప్ర‌తి ఒక్క‌రిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాజాసింగ్ స్పష్టం చేశారు. 

అయితే బారికేడ్లు తొలిగించే ముందు మ‌జ్లిస్ ఎమ్మెల్యే అహ్మ‌ద్ బ‌లాలా మీర్‌చౌక్ ఏసీపీ నుంచి అనుమ‌తి తీసుకున్నారని ద‌బీర్‌పుర పోలీసులు ఎంఐఎం ఎమ్యెల్యే చర్యకు మద్దతుగా స్పందించడం గమనార్హం. బారికేడ్లను తొలిగించే అవసరం ఏర్పడితే పోలీసులే స్వయంగా తొలగిస్తారు గాని, ఆంక్షలను ధిక్కరించి  తొలగించుకోవచ్చని వేరేవారికి అనుమతి ఇవవడం ఎక్కడా జరగదు.