కాంగ్రెస్ నేతల అకౌంట్లోని డబ్బును పంచండి 

 దేవాలయాల్లోని బంగారాన్ని అతి తక్కువ వడ్డీకి తీసుకొని, దాన్ని పేదలకు వినియోగించాలన్న కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి  పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యలపై సాధు సంతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల అకౌంట్లోని డబ్బును మొదట పంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

‘‘హిందూ దేవాలయం నుంచి డబ్బులు తీసుకునే ముందు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సంపాదించిన భారీ సంపాదనను కరోనాను ఎదుర్కోడానికి వినియోగించాలి’’ అని మహంత్ కమల్ నయన్ దాస్ డిమాండ్ చేశారు. 

ఇక మరో స్వామీజీ మని రామ్‌దాస్ చావ్నీ మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతలు దేశ వ్యతిరేకులని, మసీదులు, చర్చిల నుంచి డబ్బులు తీసుకోకుండా కేవలం దేవాలయాల నుంచే డబ్బులు తీసుకోవాలని ఎందుకు అడుగుతున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. 

‘‘దేశంలోని వివిధ దేవాలయాల్లో 76 లక్షల కోట్ల విలువైన బంగారం నిల్వలున్నాయి, ట్రస్టీలతో మాట్లాడి ఆ బంగారాన్ని అతి తక్కువ వడ్డీకి తీసుకోవాలి. దాన్ని పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజల కోసం వినియోగించాలి’’ అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యానించారు.