తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్ట్ ఝలక్ 

కరోనా కేసులను, మరణాలను తక్కువ చేసి చూపించడం కోసం కొన్ని వారాలుగా కరోనా టెస్ట్ లను తగ్గించిన తెలంగాణ ప్రభుత్వం కరోనా అనుమానంతో మృతి చెందిన వారికి కరోనా పరీక్షలు జరపవద్దని అంటూ ఉత్తరువులు జారీ చేయడం తెలిసిందే. ఈ ఉత్తరువుల విషయమై తెలంగాణ హై కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. 

మృతదేహాలకు కరోనా టెస్టులు జరపవలసిందే అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.  ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టెస్ట్‌లు చేయకపోతే కేసులు మూడో దశకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. 

నెల్లూరు, కర్నూలులో డాక్టర్ల చనిపోయిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తేనే కరోనా బయటపడిందని పిటిషనర్  ఈ సందర్భంగా నివేదించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వివిధ సంస్థలు ఇచ్చిన గైడ్‌లైన్స్ పాటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రూల్స్ ఫాలో అవుతున్నారో సమ్పర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 26 వరకు మరో స్పష్టమైన నివేదిక అందివ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.