విదేశీ చదువులకు భారతీయుల వెనుకడుగు 

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడే మంచి కొలువును సంపాదించడం  గురించి సగటు భారతీయ విద్యార్థి కలలు కంటుంటారు. అయితే కరోనా మహమ్మారి సృష్టించిన విలయం విద్యార్థులను వెనుకడుగు వేసేలా చేస్తున్నది. విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకున్న 48.46 శాతం మంది భారతీయ విద్యార్థులు తమ నిర్ణయంపై పునరాలోచనలో పడ్డట్టు వెల్లడైంది.   

విదేశీ విద్యపై కరోనా ప్రభావం ఉంటుందని క్వాక్వరెల్లి సిమండ్స్ (క్యూఎస్) సంస్థ పేర్కొంది. ఫారిన్ లో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలని ప్లాన్ చేసుకున్న  ‘‘ఇండియన్ స్టూడెంట్స్ మొబిలిటీ రిపోర్టు 2020: ఇంపాక్ట్ ఆఫ్ కొవిడ్ 19 ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ చాయిస్” పేరుతో నివేదికను విడుదల చేసింది. లండన్ కేంద్రంగా పనిచేసే క్యూఎస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలు, కాలేజీలకు ర్యాంకింగ్స్ ఇస్తుంటుంది. 

ఇప్పటికే ఖరీదుగా మారిన అంతర్జాతీయ ఉన్నత విద్యారంగంలో పెట్టుబడులకు తగిన ఫలితాలు రాకపోవడం, కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం లాంటివి ఇందులో కీలక పాత్ర పోషిస్తాయని క్యూఎస్ నిపుణులు తెలిపారు. 

 ‘‘విదేశాలలో ఉన్నత విద్య చదువుకోవాలని  ఈమధ్య నిర్ణయించుకున్న 48.46 శాతం మంది విద్యార్థుల నిర్ణయంపై  కరోనా ప్రభావం చూపింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) విద్యార్థులతో పోలిస్తే నాన్ స్టెమ్ విద్యార్థులలో క్కువ మంది విదేశీ చదువులపై మరోసారి ఆలోచనలో పడ్డారని పేర్కొన్నారు. 

కరోనా తర్వాత స్టెమ్ బేస్డ్ విద్యార్థులకు డిమాండ్ ఉండే అవకాశం ఉంది. కానీ నాన్ స్టెమ్ విద్యార్థులకు అంతగా అవకాశం ఉండకపోవచ్చు. ఈ కారణంగానే వారుఉన్నత విద్యా ప్రణాళికలపై పునరాలోచిస్తున్నారని ఆ నివేదికలో వెల్లడైంది. 

కరోనా తర్వాత అన్ని లెవెల్స్ లోనూ టీచింగ్, లెర్నింగ్ పద్ధతుల్లో మార్పులు వస్తాయని తెలిపింది. పైగా, చదువు కోసం విద్యార్థులు  దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లడంపైనా కూడా కరోనా ప్రభావం చూపుతుందని పేర్కొంది.