సాంకేతిక నిపుణులంద‌రికీ ప్రధాని మోదీ సెల్యూట్‌

నేష‌న‌ల్ టెక్నాల‌జీ డే సంద‌ర్భంగా ఈ రోజు సాంకేతిక నిపుణులంద‌రికీ దేశం సెల్యూట్ చేస్తున్న‌ద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పేర్కొన్నారు. తోటి ప్ర‌జ‌ల జీవితాల్లో సానుకూల మ‌ర్పులు తీసుకురావ‌డం కోసం సాంకేతిక నిపుణులు ఎంతో శ్ర‌మించి టెక్నాల‌జీని అభివృద్ధి చేస్తున్నార‌ని ప్ర‌ధాని కొనియాడారు.

1998లో ఇదే రోజున‌ మ‌న శాస్త్ర‌వేత్త‌లు సాధించిన అసాధార‌ణ విజ‌యాన్ని మ‌నం మ‌ర్చిపోలేదంటూ వాజ్‌పేయి హయాంలో జ‌రిగిన‌ పోఖ్రాన్ అణుప‌రీక్ష‌ల గురించి ప్ర‌ధాని మోదీ ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో క‌రోనా మ‌హ‌మ్మారిపై పోర‌టంలో టెక్నాల‌జీ ఎన్నో విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌దని ప్ర‌ధాని ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. 

ప్ర‌పంచాన్ని క‌రోనా ర‌హితం చేయ‌డంలో టెక్నాల‌జీయే ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న‌ద‌ని ఆయ‌న ప్ర‌శంసించారు. క‌రోనా వైర‌స్‌ను పార‌దోల‌డం కోసం జ‌రుగుతున్న ప‌రిశోధ‌న‌ల్లో, ఆవిష్క‌ర‌ణ‌ల్లో ముందుండి ప‌నిచేస్తున్న ప్ర‌తి ఒక్క సాంకేతిక నిపుణుడికి తాను సెల్యూట్ చేస్తున్నాన‌ని ప్ర‌ధాని ట్వీట్ చేశారు.