కాంగ్రెస్ రాజకీయంపై శివసేన ఉగ్రరూపం 

మహారాష్ట్ర శాసన మండలికి జరుగుతున్న ఎన్నికలలో ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే ఎన్నిక కాకుండా కాంగ్రెస్ అదనంగా మరో అభ్యర్థిని పోటీకి పెట్టడం పట్ల శివసేన ఉగ్రరూపం దాల్చింది.  

ఉద్దవ్‌ థాక్రేను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, అలా కుదరనిపక్షంలో ఎన్నికల బరి నుంచి ఉద్దవ్‌ తప్పుకొంటారని శివనసేన సీనయర్‌ నేత సంజయ్‌ రౌత్‌ హెచ్చరించారు. పరోక్షంగా కూటమి నుండి తప్పుకుంటామనే సంకేతం ఇచ్చారు. 

రాష్ట్రంలో అధికారం పంచుకొంటున్న కాంగ్రెస్‌ తమతో రాజకీయాలు చేయడం ఏమాత్రం బాగోలేదని ధ్వజమెత్తారు. ఉద్దవ్‌ థాక్రేను ఏకగ్రీవంగా ఎన్నుకొని శాసనమండలికి పంపుదామని ఆయన కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ నేతలకు స్పష్టంచేస్తున్నానని తెలిపారు. 

ఉద్దవ్‌ థ్రాక్రే  ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడరు, కానీ ప్రస్తుత పరిస్థితి రాజకీయ యుద్ధాలకు దారితీయొద్దని తాము భావిస్తున్నట్లు సంజయ్‌ రౌత్‌ చెప్పారు.