అమిత్ షా లేఖతో ఖంగుతున్న మమతా 

వలస కార్మికులను తరలించడానికి సహకరించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వ్రాసిన లేఖతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖంగుతిన్నట్లు కనిపిస్తున్నది. తన ప్రభుత్వ పనితీరుపై ప్రజలలోకి తప్పుడు సంకేతాలు పంపవచ్చని వెనుకడుగు వేసిన్నట్లున్నారు. 

అందుకనే ఆ లేఖ పంపిన కొద్దీ గంటలకే పశ్చిమ బెంగాల్‌లోకి 10 శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్లు వచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. 

 ‘‘బెంగాల్‌ ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఆశించిన సహకారం రావడం లేదు. ప్రత్యేక రైళ్లను రాష్ట్రంలోకి మీరు అనుమించడం లేదు. మీ కూలీల పట్ల మీరు అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామం వా రిని మరిన్ని కష్టాల్లోకి నెడుతుంది" అంటూ తన లేఖలో అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆ  లేఖలో అమిత్‌షా చేసిన ఆరోపణలను టీఎంసీ ఎంపీ, మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ ఖండించినప్పటికీ ప్రభుత్వ పరంగా మౌనం వహించడం గమనార్హం.